Thursday, September 3, 2026 03:02 PM
Thursday, September 3, 2026 03:02 PM

హీరోయిన్ కేసు క్లోజ్ అయిందా..? ఐపీఎస్ అధికారుల రీ-ఎంట్రీ..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్ కాదంబరి జెత్వాని కేసు ఒక లాజికల్ ఎండ్స్ వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జెత్వానిని వేధించారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలకు కూటమి ప్రభుత్వం నుండి ఊరట లభించింది. వారిపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం తక్షణమే విధుల్లోకి ఆహ్వానించింది. అయితే, అధికారులపై వేటు ఎత్తివేయడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. జెత్వాని కేసులో దర్యాప్తు సంస్థలు సేకరించిన తిరుగులేని ఆర్థిక సాక్ష్యాలే కారణమని స్పష్టమవుతోంది.

Also Read : ధోనీ మళ్లీ హుక్కా తాగుతున్నాడా..? రిషభ్ పంత్‌తో పార్టీ వైరల్..!

ఇటీవల ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించిన సవరించిన చార్జ్ షీట్ లో జెత్వాని చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని, అసలు నేరస్తురాలు ఆమెనే అని పేర్కొంది. కుక్కల విద్యాసాగర్‌తో ఉన్న పాత పరిచయాల ఫోటోలను వాడుకుని, వాటిని బయటపెడతానంటూ భయపెట్టి ₹1.32 కోట్లను బ్యాంక్ ఖాతాల ద్వారా బదిలీ చేయించుకున్నట్లు సీఐడీ పక్కా సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. అంటే, బాధితురాలిగా చెప్పుకున్న నటి.. వాస్తవానికి బ్లాక్‌మెయిలింగ్, వసూళ్లకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది.

Also Read : ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో తెలుసు రోజా..!

చార్జ్‌షీట్‌లో నటిదే తప్పు అని తేలడంతో, ఆ నటి ఫిర్యాదు ఆధారంగా గతంలో తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాలను ప్రభుత్వం పునఃసమీక్షించింది. అధికారులపై మోపబడిన ఆరోపణలకు ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేవని, నిబంధనల ప్రకారమే వారు నాడు వ్యవహరించారని తేలడంతోనే సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నటి జెత్వాని ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నట్లు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ చార్జ్‌షీట్ మరియు అధికారుల రీ-ఎంట్రీ చూస్తుంటే ఈ కేసులో ఆమెకు చట్టపరమైన ఉచ్చు బిగుసుకుందని, ఐపీఎస్ అధికారుల చాప్టర్ పూర్తిగా క్లియర్ అయిందని స్పష్టమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అక్టోబర్‌లోనే స్థానిక పోరు.....

అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో...

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

రాజీనామా చేయండి.. కొండాకు...

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న...

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

మొన్న భోగాపురం.. నిన్న...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కొన్ని రోజులు...

పోల్స్