Thursday, August 27, 2026 12:47 PM
Thursday, August 27, 2026 12:47 PM

ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల అందజేతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3 లక్షల మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని నిర్దేశించింది. ఇందుకోసం సెప్టెంబరు రెండో వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అక్టోబరు నెలలో అర్హులకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు తొలి వారంలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read : జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో భేటీకి రంగం సిద్ధం!

కొత్త పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం విడతల వారీ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మిగతా కేటగిరీల లబ్ధిదారులకు ఆ తర్వాత విడతల వారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. పింఛనుకు ఎంత మంది అర్హులు ఉన్నారనేది గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది. ఈ సర్వే డేటా ఆధారంగా క్షేత్రస్థాయిలో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు.

Also Read : మళ్లీ తెరపైకి జమిలీ రచ్చ..!

ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది వితంతువులు ఉన్నట్లు గుర్తించారు. వీరి వివరాలను ఆరు అంచెల నిబంధనలతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వడపోత అనంతరం తుదిగా 1.50 లక్షల మంది అర్హులు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. మిగిలిన కేటగిరీల దరఖాస్తులను కూడా ఇదే తరహాలో పారదర్శకంగా పరిశీలించి అర్హులను ఖరారు చేయనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి...

రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారడం కొత్తేమీ...

వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య...

ఓ వైపు అధికారం కోల్పోయిన నిర్వేదం.....

వైసీపీ ప్రేమలో సిఐ...

పులివెందులలో వైకాపా కబ్జాదారులకు కొందరు పోలీస్...

పోల్స్