Tuesday, August 25, 2026 07:11 PM
Tuesday, August 25, 2026 07:11 PM

మళ్లీ తెరపైకి జమిలీ రచ్చ..!

దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే కీలకమైన ‘జమిలి ఎన్నికల’ విధానంపై మరోసారి చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమ సర్కారు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు, యూటీల సభ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధికార కూటమి నేతలు విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : నన్ను వేధించోద్దు ప్లీజ్.. అంబటి సంచలన కామెంట్స్..!

జమిలి ఎన్నికల నిర్వహణను విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఏక కాల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్నది. మరో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. మొత్తంగా 22 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలు జరగడానికి ముందే ఎన్డీయే పాలిత 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే మరో నాలుగు ఎన్డీయే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగతా ఏడు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ఎన్నికలు 2030-31 మధ్య జరగనున్నాయి. దీంతో జమిలి ఎన్నికల కోసం తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పాలనను వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకునేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని ఎన్డీయే సర్కారు భావిస్తుంది.

2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ‘జమిలి’ ప్రక్రియకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తుంది. జమిలి ఎన్నికల కోసం ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది.

Also Read : నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే సరికొత్త పొలిటికల్ క్యాంపెయిన్..!

ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030-31లో ముగియనుంది. వాటి గడువును ఒకటి నుంచి రెండేళ్లు తగ్గించాల్సి వస్తుంది. అయితే, ఇంతటి భారీ సంస్కరణకు పార్లమెంట్ శాసనపరమైన మార్పులు చేయడంతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీజేపీకి జగన్ గుడ్‌బై..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో...

జోగి నీకు ఓ...

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే...

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు మరింత...

నన్ను వేధించోద్దు ప్లీజ్.....

కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం తన...

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

పోల్స్