Monday, October 12, 2026 05:19 AM
Monday, October 12, 2026 05:19 AM

బీజేపీకి జగన్ గుడ్‌బై..? ఈడీ దూకుడు వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో సరికొత్త పొలిటికల్ సంచలనానికి తెరలేచింది. గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు తన రూట్ మార్చబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇకపై జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి ఆత్మీయుడు కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం.. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో వైఎస్ జగన్ రహస్యంగా భేటీ అయ్యి, కీలక చర్చలు జరిపారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో విపరీతమైన ప్రచారం సాగుతోంది.

Also Read : కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు కాదు… పాపాల ఫలితం

ఈ ఊహించని పొలిటికల్ షిఫ్ట్ వెనుక జగన్ మోహన్ రెడ్డి సరికొత్త రాజకీయ విశ్లేషణలు మరియు అంచనాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్స్ ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై కొత్త తరం యువత తీవ్ర అసంతృప్తితో ఉందని, వారు రాబోయే రోజుల్లో తిరుగుబాటు చేసే అవకాశం ఉందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని, ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న యువత అంతా రాహుల్ గాంధీ నాయకత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని వైసీపీ అధినేత అంచనా వేస్తున్నారు.

Also Read : టెక్కీలకు ట్రంప్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం..!

అందుకే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ఇండియా కూటమి వైపు అడుగులు వేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ రహస్య చర్చల వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందే లీక్ అవ్వడం వల్లే.. ఇప్పుడు వివేకా హత్య కేసును టార్గెట్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకస్మాత్తుగా రంగంలోకి దిగిందా..? అనే సరికొత్త అనుమానాలు పొలిటికల్ డిబేట్లకు దారితీస్తున్నాయి. జగన్ రూట్ మారుస్తున్నారనే కోపంతోనే కేంద్రం ఈడీ దూకుడును పెంచిందా అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, జగన్ మోహన్ రెడ్డి గనుక అధికారికంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. అది అటు ఏపీ పాలిటిక్స్‌తో పాటు, ఇటు జాతీయ స్థాయిలో సరికొత్త సమీకరణాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్