పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న షహజాద్ భట్టి నెట్వర్క్ దేశవ్యాప్త కుట్రలను భద్రతా సంస్థలు భగ్నం చేయగా, తాజాగా హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన కీలక లింకులు బయటపడ్డాయి. నగరంలోని యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాలలో ఈ నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు ఆపరేటివ్‌లను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన మెగా ఆపరేషన్‌లో తెలంగాణ నుంచి ఈ ఇద్దరూ పట్టుబడటం నగరంలో కలకలం రేపుతోంది.
Also Read : భారత్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటీ..?
దుబాయ్ కేంద్రంగా పాక్ ఐఎస్ఐ నిధులతో నడుస్తున్న గ్యాంగ్‌స్టర్ కమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షహజాద్ భట్టి, భారతీయ యువతను తప్పుదోవ పట్టించడానికి సరికొత్త వ్యూహాన్ని ఎంచుకున్నాడు. నిరుద్యోగ యువతను ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ ద్వారా ఆకర్షించి, వారికి భారీగా డబ్బు ఆశ చూపి డిజిటల్ టెర్రరిజంలోకి లాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ చాటింగ్స్ ద్వారానే వారికి బ్రెయిన్ వాష్ చేస్తూ దేశ వ్యతిరేక చర్యలకు పురికొల్పుతున్నాడు.
Also Read : పరిశ్రమల్లో పచ్చని విప్లవం.. పవన్ ఆదేశాలతో 43 వేలకు పైగా మొక్కలు..!
ఈ నెట్‌వర్క్‌లో భాగంగా మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన జాయిద్ ఖాన్ (22) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఎస్ఐ సానుభూతిపరులతో నిరంతరం చాటింగ్ చేస్తూ, ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుండగా కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇతడిని గుట్టుచప్పుడు కాకుండా పట్టుకుంది. అలాగే యూసుఫ్‌గూడలోని ఒక స్వీట్ షాపులో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన మరో యువకుడు కూడా ఈ ఉగ్ర సిండికేట్‌తో నిరంతరం డిజిటల్ సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెట్వర్క్ దేశంలో కేవలం దాడులు చేయడమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన సరికొత్త కుట్రకు తెరలేపింది. రక్షణ రంగానికి చెందిన కీలక ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, మతపరమైన స్థలాల వద్ద రహస్యంగా సీసీటీవీ మెరాలు ఏర్పాటు చేసి, ఆ లైవ్ ఫీడ్ నిఘా సమాచారాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్‌కు చేరవేయడం వీరి ముఖ్య ఉద్దేశం.

