Sunday, September 27, 2026 10:05 AM
Sunday, September 27, 2026 10:05 AM

షూటింగ్ లేకపోయినా సెట్స్ లోనే ప్రభాస్.. ఎందుకు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి వరుస భారీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోగా గడుపుతున్నాడు. ఒకేసారి మూడు పెద్ద సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా విషయంలో మాత్రం ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : అమరావతి సీడ్ యాక్సెస్ దుష్ప్రచారం.. అసలు నిజాలు ఇవే..!

భీమవరంలో జరిగిన రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత వై. రవిశంకర్.. ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ప్రభాస్ చూపిస్తున్న డెడికేషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ప్రభాస్ అన్న రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌లోనే ఉంటున్నారు. అంత బిజీ షెడ్యూల్‌లో కూడా.. ఒకవేళ ఆయనకు సంబంధించిన సీన్ల షూట్ లేకపోయినా సరే విశ్రాంతి తీసుకోకుండా స్వయంగా సెట్స్‌కు వస్తున్నారు. మానిటర్ దగ్గర కూర్చుని జరుగుతున్న షూటింగ్‌ను, ప్రతి చిన్న జాగ్రత్తను దగ్గరుండి పరిశీలిస్తున్నారు” అని రవిశంకర్ తెలిపారు.

Also Read : భారత్ లో ఆల్ ఖైదా.. ఢిల్లీ అటాక్స్ వెనుక..!

అంతేకాదు, ఈ సినిమా అవుట్‌పుట్ వేరే లెవెల్‌లో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదని ఆయన అభిమానులకు ప్రామిస్ చేశారు. ‘స్పిరిట్’, ‘కల్కి 2’ సినిమాల కంటే ముందే ‘ఫౌజీ’ థియేటర్లలోకి రానుండటంతోనే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్