సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026 పై రాజ్యసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ యంగ్ ఎంపీ చింతకాయల విజయ్ తన వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకున్నారు. కేవలం ఉన్నత న్యాయస్థానాల్లోనే కాకుండా, అవినీతి మరియు ఆర్థిక నేరాలను విచారించే స్పెషల్ సీబీఐ కోర్టులలో కూడా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బలంగా వాదించారు. దేశంలో త్వరితగతిన న్యాయం జరగాలంటే దిగువ స్థాయి ప్రత్యేక కోర్టులను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..!
తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల తీరును ఎంపీ విజయ్ ఉదాహరణగా చూపిస్తూ అసలు సిసలు నిజాన్ని నిర్భయంగా వెల్లడించారు. “జగన్ పై దాదాపు 31 తీవ్రమైన సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ 13 ఏళ్లు గడుస్తున్నా కనీస ప్రొసీడింగ్స్ ముందుకు సాగడం లేదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాన్ని భరించలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించడానికి, విజయ్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే విజయ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజాధనం లూటీ అయిన కేసుల్లో ఇంత ఆలస్యం కావడం వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలను ఎండగట్టారు. న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ చింతకాయల విజయ్ వేసిన నిలదీత సభలో ఆలోచన రేకెత్తించింది. “ఒక ఆర్థిక నేరగాడి కేసులో కేవలం డిశ్చార్జ్ పిటిషన్ విచారించడానికే 13 ఏళ్ల సమయం పడితే, ఇక అసలైన ట్రయల్ ఎప్పుడు మొదలవుతుంది..? తీర్పు ఎప్పుడు వస్తుంది..?” అని ఆయన ధ్వజమెత్తారు. న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే ఇటువంటి సుదీర్ఘ జాప్యాలు జరుగుతున్నాయని, దీనివల్ల నేరస్థులు చట్టం నుండి తప్పించుకునే అవకాశం దొరుకుతుందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఇండియన్ ఐటీ ఉద్యోగులకు అమెరికా భారీ షాక్..!
ఎంపీ చింతకాయల విజయ్ చేసిన ఈ ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. “త్వరితగతిన న్యాయం అందకపోవడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే” అనే నానుడిని నిజం చేస్తూ, జగన్ కేసుల జాప్యంపై ఆయన చేసిన కామెంట్స్ నూటికి నూరు పాళ్ళు నిజమని మేధావులు, సామాన్య ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఏడాదిలోగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను విజయ్ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, దేశంలో చట్టబద్ధమైన పాలన కోసం గట్టిగా నిలబడ్డారు.

