తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం ఎదురుచూస్తున్న పొలిటికల్ లీడర్లకు, ఓటర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలపై సర్కారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న ‘సర్’ ఓటర్ల జాబితా ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు ఏ రకమైన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకూడదని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా సర్ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాతే ఓటింగ్ వైపు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : గుజరాత్ లో దొరికిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!
దీని వల్ల పాత ఓటర్ లిస్టు కాస్త హోల్డ్‌లో పడటంతో పాటు కొత్త లిస్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రజల్లో కూడా దీనిపై విపరీతమైన ఆసక్తి ఉంది. ఎవరి ఓటు ఉంది.. ఎవరి ఓటు లేదు.. ఎన్ని ఓట్లు పోయాయి.. ఏ పార్టీకి ఎంత నష్టం అనే అంచనాలు వేసుకుంటున్నారు. ఓటర్ లిస్టు అప్‌డేట్ ప్రాసెస్‌కి సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల అప్లికేషన్ డెడ్ లైన్ తెలంగాణలో ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. అయితే అసలైన తుది ఓటర్ల జాబితాను మాత్రం అక్టోబర్ 10వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఆ సమయానికి తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న సరైన ఓటర్ల నంబర్లు చాలా స్పష్టంగా బయటకు వస్తాయి.
ప్రస్తుతం ‘సర్’ డ్రైవ్ నడుస్తుండటంతో పాత ఓటర్ల డేటాబేస్ పక్కన పడిపోయింది, మరోవైపు తాజా జాబితా ఇంకా పూర్తి కాలేదు. దీనివల్ల నియోజకవర్గాల్లో ఓటర్ల కౌంట్ పై ఒక రకమైన సస్పెన్స్‌తో పాటు క్లారిటీ కూడా రాలేదు. ఇది స్థానిక నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కూడా. తుది జాబితా పక్కాగా ఫైనల్ అయ్యాకే ఎలక్షన్స్ షెడ్యూల్ పై క్లారీటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి నెలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్ ప్రక్రియ పూర్తి తర్వాతే అని క్లారిటీగా చెబుతున్నాయి.
Also Read : వైసీపీ లో బోరుగడ్డ తిరుగుబాటు..కారణం అదేనా..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష న్ సహా ఖమ్మం, గ్రేటర్ వరంగల్ సిటీల్లో ఎన్నికల అంశం మరింత ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లకు ఓటింగ్ ముగిసినా, ఈ మేజర్ కార్పొరేషన్లకు మాత్రం ఏళ్ల తరబడి పోలింగ్ జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం.. పాత జీహెచ్ఎంసీని ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అనే 3 భాగాలుగా చేసింది. దీని వల్ల న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. కాగా, మరోవైపు జనాభా లెక్కల నిబంధనల వల్ల బౌండరీలను లాక్ చేశారు. నేటికీ హైకోర్టు వివాదంపై ఫుల్ క్లారిటీ రాకపోవడంతో, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది గ్రేటర్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్ల స్థానాలు సాధించడానికి లీడర్లు రెడీగా ఉన్నారు. అయితే లీగల్ క్లియరెన్స్ రావడం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.

