Sunday, September 13, 2026 03:33 PM
Sunday, September 13, 2026 03:33 PM

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే, ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా శ్రమించిన నేతల పేర్లను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీ ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు అమరావతి వర్గాల సమాచారం.

Also Read : రామాలయానికి తొలగిన అడ్డంకి..!

ప్రస్తుతం ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వర్ల రామయ్య, సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్ మరియు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి రేసులో ముందంజలో ఉన్నారు. గతంలో వివిధ కారణాల వల్ల పదవులు కోల్పోయిన మరియు ఎన్నికల సమీకరణాల్లో త్యాగాలు చేసిన మరికొందరు సీనియర్లకు కూడా ఈసారి న్యాయం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది.

Also Read : మోదీ మార్క్ సరికొత్త రాజకీయం..!

ఈ స్థానాల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ లేదా ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన ప్రకటన నేడు రాజ్‌భవన్ నుండి వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ తుది జాబితా బహిర్గతం కానుంది. ఈ పరిణామాలతో అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఎవరికి ఏ పదవి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్