Tuesday, July 28, 2026 12:43 AM
Tuesday, July 28, 2026 12:43 AM

మోదీ మార్క్ సరికొత్త రాజకీయం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శైలిలో ఇటీవల కనిపిస్తున్న మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన వరుసగా సెల్ఫీ వీడియోల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను, సరికొత్త విధానాలను స్వయంగా ప్రజలకు వేగంగా తెలియజేస్తున్నారు. ఈ సరికొత్త కమ్యూనికేషన్ స్టైల్ సామాన్య ప్రజలకు సైతం ఎంతో ఆకట్టుకుంటోంది. గతంలో మోదీ ప్రసంగాల అనగానే సుదీర్ఘమైన సంభాషణలు, ప్రత్యర్థులపై వేసే పదునైన పంచ్‌ లు, సుదీర్ఘమైన విమర్శలు గుర్తుకొచ్చేవి.

Also Read : జనాల డబ్బులతోనే గెలిచా.. మాజీ సీఎం ప్రకటన..!

కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ఎక్కడా పరనింద లేకుండా, అనవసరమైన దీర్ఘాలు తీయకుండా, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, సాఫీగా ప్రజల ముందుకు ఉంచుతున్నారు. మోదీ గారు ఏది చేసినా ఒక సంచలనమే అన్నట్లుగా ఈ తాజా మార్పు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలు ఒక సరికొత్త మలుపు తీసుకోబోతున్నాయనే బలమైన సంకేతాలను ఇస్తున్నాయి. పాలనా పరంగా ప్రస్తుతం కొంత తగ్గినా.. రాజకీయంగా మాత్రం ఆయన అత్యంత చతురతను ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Also Read : అమెరికా గ్లోబల్ వీసా బాంబ్.. ఆ తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి నో-ఎంట్రీ..!

“ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు” అన్న తరహాలో మోదీ ప్రస్తుత వ్యూహాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఫాస్ట్ ట్రాక్ చేయడమే కాకుండా, తానే స్వయంగా రంగంలోకి దిగి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సరికొత్త పంథా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో ముందు ముందు కాలమే సమాధానం చెప్పనుంది. ఈ వీడియోలకు సామిక మాధ్యమాల్లో.. విస్త్రుత స్పందన వస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

హైడ్రా కమిషనర్ ను...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.....

ఏపీలో స్థానిక సంస్థల...

ఆంధ్రప్రదేశ్‌ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌...

అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే...

సమకాలీన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలుగుదేశం...

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

పోల్స్