Tuesday, July 28, 2026 03:06 AM
Tuesday, July 28, 2026 03:06 AM

జనాల డబ్బులతోనే గెలిచా.. మాజీ సీఎం ప్రకటన..!

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చేశారు. ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల వక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. మండ్య జిల్లాలోని కే.ఆర్.పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రస్తుతం అత్యంత కలుషితమయ్యాయని.. నిజాయతీతో కూడిన రాజకీయాలు మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు.

Also Read : అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే బోండా ఉమ హాట్ కామెంట్స్..!

2028 నాటికి తన వయసు 82 ఏళ్లకు చేరుకుంటుందని, అప్పుడు ఇప్పుడున్నంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా పని చేయలేకపోవచ్చని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అక్కడున్న మద్దతుదారులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని వారు సిద్ధరామయ్యను కోరారు. అయినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని ‘ఎక్స్’ వేదికగా మరోసారి ధ్రువీకరించారు.

Also Read : అసలు ఎవరీ ధర్మేంద్ర ప్రధాన్..? విద్యార్థి నేతగా మొదలై.. విద్యార్థుల దెబ్బకే రాజీనామా..!

2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా అని స్పష్టం చేశారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ, తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నికల తీరుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజలే ఆర్థికంగా సహాయం చేసి గెలిపించేవారని.. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రస్తుత రాజకీయాల్లో పెరిగిపోయిన ఖర్చు గురించి ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య, 2028 నాటికి ప్రజా జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటారు.

Also Read : ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు.. మరో సంస్కరణ..!

తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో గెలుపోటములను చూసినట్లు సిద్ధరామయ్య గుర్తు చేశారు. కానీ, తాను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గానీ, అంతరాత్మకు విరుద్ధంగా గానీ ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కర్ణాటక ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, తన మిగిలిన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని సిద్ధరామయ్య తెలిపారు. కాగా, సిద్ధరామయ్య రెండు పర్యాయాలుగా మొత్తం ఎనిమిదేళ్లకు పైగా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం సీఎం పదవిలో ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. 2013 నుంచి 2018 వరకు పూర్తి ఐదేళ్ల పాటు, ఆ తర్వాత 2023 నుంచి 2026 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన గతంలో 2013, 2018, 2024 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ, తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

హైడ్రా కమిషనర్ ను...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.....

ఏపీలో స్థానిక సంస్థల...

ఆంధ్రప్రదేశ్‌ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌...

అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే...

సమకాలీన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలుగుదేశం...

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

పోల్స్