Monday, July 27, 2026 10:02 PM
Monday, July 27, 2026 10:02 PM

అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే బోండా ఉమ హాట్ కామెంట్స్..!

సమకాలీన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తన వివరణ కోరడంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం వివరణ అడిగితే ఖచ్చితంగా ఇస్తానని, అయితే తాను ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించిన ఏ సభకూ హాజరుకాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read : అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందా..?

జనసేన పార్టీ మాజీ నేత దాసరి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే తాను వెళ్లానని బోండా ఉమ వివరించారు. ఆ సభలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కనిపిస్తే రాజకీయాలకు అతీతంగా కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించానని, దీనికి రాజకీయ రంగు పూయడం సరికాదని అన్నారు. తానేమీ పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేయలేదని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఆయన పార్టీలోని ఇతర నేతల ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందా..?

వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూతో పాటు వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. మరి వారిని కూడా పార్టీ అధిష్ఠానం వివరణ అడుగుతుందా? అంటూ బోండా ఉమ ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణను దాటి ప్రవర్తించలేదని, భవిష్యత్తులోనూ పార్టీ లైన్‌లోనే నడుచుకుంటానని బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ అంతర్గత పరిణామాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

హైడ్రా కమిషనర్ ను...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.....

ఏపీలో స్థానిక సంస్థల...

ఆంధ్రప్రదేశ్‌ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌...

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్...

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్...

పోల్స్