Sunday, September 13, 2026 08:18 PM
Sunday, September 13, 2026 08:18 PM

ఉద్యమం విస్తరిస్తోంది.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..!

నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంలా విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా ప్రారంభమైన ఈ డిజిటల్ మూవ్‌మెంట్, కేవలం కొన్ని రోజుల్లోనే లక్షలాది మంది యువతను రోడ్లపైకి తెస్తుందని కేంద్ర ప్రభుత్వం అస్సలు ఊహించలేకపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఈ ఆందోళనలు సద్దుమణుగుతాయని భావించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, మోదీ ప్రభుత్వం సైతం ప్రస్తుత పరిస్థితులను చూసి విస్మయానికి గురవుతున్నాయి.

Also Read : అమరావతి నిర్మాణంలో కీలక మైలురాయి..!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. నిరసనకారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, ఐటీఓ వంటి ఢిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను అధికారులు గురువారం ఉదయం పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోతుండటాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నిరసనకారులను శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రులు సీజేపీ ప్రతినిధులు మరియు విపక్ష నేతలతో చర్చల ప్రక్రియకు తెరలేపారు.

Also Read : దిగి వచ్చిన మోడీ.. కీలక ప్రకటన..

ఈ ఉద్యమం కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా బెంగళూరు, హైదరాబాద్, పాట్నా, సూరత్, లక్నో వంటి నగరాలకు కూడా వేగంగా విస్తరించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, సామాజిక రంగాల ప్రముఖులు విద్యార్థుల పోరాటానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ సరికొత్త యూత్ మూవ్‌మెంట్, మోదీ 3.0 ప్రభుత్వానికి అత్యంత పెద్ద పబ్లిక్ ఛాలెంజ్‌ గా మారింది. యువతలో వ్యక్తమవుతున్న ఈ అపూర్వమైన ఆగ్రహాన్ని ముందే అంచనా వేయలేకపోవడం వల్లే ప్రభుత్వం రక్షణలో పడిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్