మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య.. డైరక్టర్ బాబీ కలయికలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం మెగా 158. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ నటుడు, చిరంజీవి ఆప్తమిత్రుడు శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read : రాజీ కోసం జగన్ ప్రయత్నాలు..!
1991లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ గ్యాంగ్ లీడర్ తర్వాత దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామానికి వీరిద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్‌పై ముఖాముఖి తలపడనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజ జీవితంలో చిరంజీవి, శరత్ కుమార్ అత్యంత సన్నిహిత మిత్రులు. చిరంజీవి తన ప్రాణస్నేహితుడని, క్లిష్ట సమయాల్లో తనకు ఎంతో చేయూతనిచ్చారని శరత్ కుమార్ చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. చిరుతో కలిసి నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన కథ కుదరకపోవడం వల్లే ఇన్నాళ్లు పట్టిందని ఆయన గతంలో తెలిపారు.
Also Read : భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్..!
ఇప్పుడు బాబీ సిద్ధం చేసిన పవర్ ఫుల్ స్క్రిప్ట్ లో ఇద్దరు దిగ్గజ నటులు నటనతో పోటీపడనుండటం విశేషం. శరత్ కుమార్ ఇటీవలి కాలంలో తెలుగులో భరత్ అనే నేను, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలకు సిద్ధం చేస్తుండగానే, మరోవైపు మెగా 158 షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు.

