Thursday, July 23, 2026 12:09 AM
Thursday, July 23, 2026 12:09 AM

ఢిల్లీని వణికించిన కాంగ్రెస్ ధర్నా.. చెమటలు పట్టించారా..?

దేశ రాజధాని వేదికగా మంగళవారం జరిగిన రాజకీయ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, విద్యా రంగంలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఢిల్లీని అక్షరాలా స్తంభింపజేసింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంతటి దూకుడును, ఉధృతిని ప్రదర్శించడంతో కేంద్ర ప్రభుత్వంలో ఒక్కసారిగా వణుకు మొదలైంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు దూసుకువెళ్లడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Also Read : ఆ కేసు విచారణ.. వెంకన్నకే ఎరుక..!

నిజానికి, నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై యువత నేతృత్వంలో ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఈ ఉద్యమానికి గట్టి పునాది వేసింది. విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ప్రయోగించిన లాఠీలు, భాష్పా వాయువు దేశాన్ని కలచివేసాయి. అయితే, ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఈ విద్యార్థి ఉద్యమంలోకి ఎంటర్ అయిందో.. ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. విద్యార్థులపై దాడిని యావత్ భారత కుటుంబాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో ఉద్యమం దేశవ్యాప్త రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది.

కాంగ్రెస్ అగ్రనేతలు స్వయంగా రోడ్డుపై బైఠాయించి, ప్రధానమంత్రి నివాసానికి కొద్ది మీటర్ల దూరంలోనే ధర్నాకు దిగడంతో కేంద్ర సర్కార్ పూర్తిగా రక్షణలో పడిపోయింది. తక్షణమే రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు, హోమ్ సెక్రటరీ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపాల్సి రావడం.. ప్రభుత్వం ఎంతగా ఒత్తిడికి లోనైందో స్పష్టం చేస్తోంది. మరోవైపు, అంతవరకు ఈ భారీ ప్రజా నిరసనలను పెద్దగా పట్టించుకోకుండా, కవర్ చేయకూడదని భావించిన కొన్ని ప్రధాన స్రవంతి నేషనల్ మీడియా ఛానళ్లు సైతం కాంగ్రెస్ ఎంట్రీతో తమ వైఖరిని మార్చుకోక తప్పలేదు.

Also Read : ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీకి లైన్ క్లియర్..?

రాహుల్ గాంధీని పోలీసులు రోడ్డుపై నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను విస్మరించడం ఏ మీడియాకూ సాధ్యపడలేదు. దాంతో అన్ని ప్రధాన జాతీయ ఛానళ్లు లైవ్ ప్రసారాలతో ఈ ధర్నాను ప్రముఖంగా కవర్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నప్పుడు కూడా ఆయన తగ్గలేదు, “మోదీ.. ఎంత అణచివేసినా విద్యార్థుల న్యాయం కోసం సాగే ఈ పోరాటం ఆగేది లేదు” అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని కాంగ్రెస్ గట్టిగా పట్టుబట్టింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం, జనం నుంచి వచ్చిన అపూర్వ స్పందన చూస్తుంటే.. మోదీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఈ ప్రజా పోరాటమే అంతానికి ఆరంభం.. అని కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజీ కోసం జగన్...

ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ...

విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి...

జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు...

ఆ కేసు విచారణ.....

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి...

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

పోల్స్