Friday, September 4, 2026 07:11 PM
Friday, September 4, 2026 07:11 PM

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్..? బీసీసీఐ సంచలన నిర్ణయం..!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు ముగిసిపోయినట్లేనని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్‌ ను ఇకపై వన్డే ఫార్మాట్‌కు ఎంపిక చేయకూడదని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జూలై 19న ఇంగ్లాండ్‌ తో జరిగే మూడో వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి వన్డే మ్యాచ్ కానుందని సమాచారం. భారత సెలెక్షన్ కమిటీ ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచకప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Also Read : ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?

39 ఏళ్ల రోహిత్ శర్మను కాదని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు. రాబోయే 20 వన్డేల్లో జైస్వాల్‌ కు నిరంతరంగా అవకాశాలు కల్పించి, అతన్ని ప్రపంచకప్‌ కు సిద్ధం చేయడమే సెలెక్టర్ల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కీలక నిర్ణయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ తో చర్చించినట్లు సమాచారం. విరాట్ కోహ్లీ ఫామ్, ఫిట్నెస్ పరంగా జట్టులో కొనసాగుతాడని, అయితే రోహిత్ శర్మ విషయంలో మాత్రం తాము ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు గంభీర్‌ కు సెలెక్టర్లు స్పష్టం చేశారు.

Also Read : అదిరిపోయే మైలేజ్‌తో మార్కెట్‌లోకి కియా సిరోస్ ఎలక్ట్రిక్ కార్..!

కాగా, ఈ విషయమై రోహిత్ శర్మతో బీసీసీఐ అధికారులు చర్చించగా, తనను పక్కన పెట్టడంపై రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది రోహిత్ శర్మనేనని, సెలెక్టర్లు మాత్రం తమ నిర్ణయాన్ని అతనికే వదిలేశారని సమాచారం. గత ఎనిమిది వన్డేల్లో రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 30.1 సగటుతో 241 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌ లోనూ మొదటి వన్డేలో 11 పరుగులు, రెండో వన్డేలో 26 పరుగులతో ఆకట్టుకోలేదు. కేవలం వన్డేలే కాకుండా, రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో కూడా సెలెక్షన్ కమిటీకి, అతనికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

పోల్స్