యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో అయితే రావణ్ కోసం వైసీపీ నేతలు పోటీ పడి మరీ కామెంట్లు చేస్తుంటే.. టీడీపీ, జనసేన పార్టీల అభిమానులతో పాటు పలువురు హిందువులు కూడా వైసీపీ తీరును తప్పుబడుతున్నారు. చివరికి సోషల్ మీడియా రావణ్ వల్ల రావణకాష్టంలా రగిలిపోతుంది. ఏ రీల్ చూసినా.. ఏ వీడియో చూసినా.. జోసెఫ్‌కు మద్దతుగానో.. వ్యతిరేకంగానో.. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగానో.. అనుకూలంగానో ఉంటున్నాయి. రావణ్‌తో సహా అన్నీ వైసీపీ స్పాన్సర్డ్ అని సీఎం చంద్రబాబు సైతం ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. మంత్రి సత్యకుమార్ సైతం రాజధాని వ్యవహారంలో జగన్ పై దండెత్తారు తప్ప.. ఈ విషయంలో నోరిప్పలేదు.
Also Read : షాకింగ్: నల్లమలలో అమరావతి 13వ శతాబ్దం ఆనవాళ్ళు..!
గతంలో తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా బీజేపీ ఇలాగే వ్యవహరించింది. జగన్‌కు వ్యతిరేకంగా నడిచే ఏ వ్యవహారంలో కూడా బీజేపీ ప్రత్యక్షంగా ముందుకు రావడం లేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ వ్యవహారంలో కూడా అంతే. అసలు తిరుమల లడ్డు విషయం వెంకన్న భక్తి వ్యవహారం అయినా కూడా బీజేపీ అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ వీడియోలన్నీ హిందూత్వ వ్యతిరేకం అయినా కూడా ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. పైగా రావణ్ మాట్లాడిన విధానం తప్పని తెలిసినా అతడు బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేశాడనే లెఫ్ట్ పార్టీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా నిరభ్యంతరంగా లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయినా బీజేపీ నేతలు మాత్రం గడప దాటడం లేదు.
దీనికి రెండు కారణాలు అయి ఉండాలి. ఒకటి తమ పాత్ర పోషించమని పవన్ కల్యాణ్‌కు బీజేపీ వదిలేసి ఉండాలి. లేదా జగన్ అనే ఆప్షన్‌ను వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని అయినా అనుకోవాలని విశ్షేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సనాతన ధర్మం మొదలు.. బీజేపీ సిద్ధాంతాలను పవన్ అగ్రెసివ్‌గా ముందుకు తీసుకుపోతున్నాడు. దీని వలన తనకు రాజకీయంగా నిలకడ లేదనే ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఉగ్రవాద నిరోధక చట్టం లాంటి సీరియస్ సెక్షన్‌ను ఇప్పటివరకు బీజేపీనే ఎక్కువ వాడింది. అలాంటి దానిని ఏపీలో ముందుకు తెచ్చారంటే బీజేపీ సలహా లేకుండా పవన్ చేశారని అనుకోలేని పరిస్థితి. అంటే అటు పవన్‌ను డైరెక్ట్ చేస్తూ.. ఇటు జగన్ ఆప్షన్‌లో ఉంచుకుంటూ ఏపీలో అధికారమే లక్ష్యంగా మోదీ, షాలు పావులు కదుపుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఒక రాజకీయ యజ్ణం నిర్వహిస్తూ.. అందులో కేవలం పండితుడి పాత్ర పోషిస్తూ.. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడిని భవిష్యత్‌కు సిద్ధం చేస్తుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన సూపర్ సక్సెస్..!
ఈ చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే హిందూత్వకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సహజంగా రియాక్ట్ కావాల్సింది బీజేపీ నేతలు.. కానీ వాళ్లు మాత్రం నోరు మెదపడం లేదు. పైగా రాష్ట్రంలో పరిస్ధితి ఇంతగా మారిపోయినా కూడా మాట్లాడటం లేదు. అంటే వారికి ఖచ్చితంగా పై నుంచి ఆదేశాలు వచ్చి ఉండాలి. తిరుమల లడ్డు విషయంలోనూ తమ నోరు కట్టేశారని.. తమను కట్టడి చేశారనే మాటలు కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్పారు కూడా.
ఈశాన్య రాష్ట్రాల నుంచి బీజేపీ ఒకటే పార్ములా ఫాలో అవుతుంది. ఎవరో ఒక నాయకుడిని అద్దెకు తెచ్చుకుని అతని ద్వారా అధికారం తెచ్చుకోవడమే ఆ ఫార్ములా. అసోంలో హిమంతను తెచ్చుకుని సాధించారు. బెంగాల్‌లో సువేందు అధికారి. అలాగే ఏపీలో పవన్ కల్యాణ్. పవన్ కూడా బీజేపీకి బాగా ట్యూన్ అయినట్లే కనపడుతోంది. బహుశా అందుకేనేమో ప్రశ్న రావణ్ విసయంలో బీజేపీ నేతలకు పని లేకుండా చేశారేమో.

