Saturday, July 4, 2026 07:32 PM
Saturday, July 4, 2026 07:32 PM

మేడం సైలెన్స్.. కారణాలేమిటీ..?

ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత యమా యాక్టివ్‌గా ఉంటారు. పొలిటికల్ ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అని సెటైరికల్‌గా మాట్లాడటం ఆమెతోనే మొదలైందని చెప్పుకుంటాయి రాజకీయవర్గాలు. అంతవరకు సరే.. రాజకీయ వ్యవహారాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కానీ, మంత్రి హోదాలో ఉండి సంబంధింత శాఖ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా అనిత కేవలం పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారా అన్నది చాలా మందికి వస్తున్న లేటెస్ట్ డౌట్. ఎందుకంటే.. రాష్ట్రాన్ని కుదిపేసిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై హోం మినిస్టర్ సక్రమంగా స్పందించలేదన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం.

Also Read : కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్..!

సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు హోమ్ మంత్రి ఒకే ఒక్కసారి స్పందించారు. అదీ కూడా కేవలం ఐదు సెకన్ల రియాక్షన్. సాధారణంగా పొలిటికల్ స్టేట్‌మెంట్స్ విషయంలో అనర్గళంగా మాట్లాడే అనిత అత్యంత కీలకమైన కేసు విషయంలో కేవలం ఐదు సెకన్లకే ఎందుకు పరిమితం అయ్యారన్నది అతి పెద్ద ప్రశ్న. రాష్ట్ర హోం మంత్రిగా అంత సీరియస్ సమస్య మీద సరిగా స్పందించకపోవడంపై వివిధ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కూడా. కస్టోడియల్ డెత్ కేసు విషయంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మంత్రే మాట్లాడ్డం లేదా?.. లేక స్పందించవద్దని ఆమెకు ఆదేశాలున్నాయా అన్న చర్చలు సైతం పెరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ విషయాన్ని విపక్షాలు సైతం నిలదీస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన కేసు విషంలో హోం మంత్రి స్పందన అత్యంత పేలవంగా ఉండటం ఏంటి? హోం మంత్రి నోరు కట్టేస్తోంది ఎవరో తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ కేసుకు సంబంధించి హోం మంత్రి రియాక్షన్‌పై రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయట. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మినిస్టర్ మేకప్‌పై వివాదాస్పద వ్యాఖ్యల చేస్తే.. అంతా ఖండించారు. అలాంటిది ఒక ప్రాణం విషయంలో ఆ స్థాయి స్పందన లేకపోవడం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి.

Also Read : వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే అనిత అలా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత మంత్రికంటే ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అయినా సరే ఆమె నుంచి నో రియాక్షన్ అంటే? దీన్నెలా అర్ధం చేసుకోవాలంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో చాలామంది ఇప్పుడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కోట్ చేస్తున్నారు కూడా. నేనే హోమ్ మంత్రి అయి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించడం.. అనిత విషయంలో సరిగ్గా సరిపోతుందా అనే చర్చలు సైతం నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారో గానీ.. వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు కొందరు. కారణం ఏదైనా సరే.. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే హోమ్ మంత్రి నోరు మెదపక పోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

పోల్స్