ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 28వ తేదీతో గవర్నర్ కోటాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోనుంది. ప్రస్తుత మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, అలాగే ఎమ్మెల్సీ రవీంద్రబాబుల పదవీకాలం పూర్తి కానుండటంతో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read : లోకేష్ మార్క్ మ్యాజిక్.. కార్పొరేట్‌ను తలదన్నుతున్న ప్రభుత్వ స్కూల్స్!
శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు, రాబోయే రోజుల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా సమర్థులైన నేతల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒకదానికి టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై రాజీ లేకుండా పోరాడినందున ఆయన సేవలకు గుర్తింపుగా ఈ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
Also Read : వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఇక మిగిలిన రెండో ఎమ్మెల్సీ స్థానం కోసం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ నేతకు కానీ, లేదా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కానీ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎంపిక ప్రక్రియలో చంద్రబాబు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల సమీకరణాలను, పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ రెండు స్థానాలను భర్తీ చేసేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

