Monday, June 29, 2026 11:58 PM
Monday, June 29, 2026 11:58 PM

ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది.. 10 అద్భుతమైన ఫీచర్లు ఇవే..!

కరోనా కాలంలో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించిన ఆరోగ్య సేతు యాప్ ఇప్పుడు సరికొత్త రూపంలోకి మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాట్‌ఫారమ్‌ను జాతీయ డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌ గా మారుస్తూ ఆరోగ్య సేతు 2.0ను అధికారికంగా ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనుసంధానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ఇకపై పౌరులు తమ మెడికల్ రికార్డులను భద్రపరుచుకోవడంతో పాటు పలు వైద్య సేవలను డిజిటల్‌ గా పొందవచ్చు.

Also Read : అమరావతిలో రౌడీ మూకలు.. సంచలన అరెస్ట్ లు..?

ఈ సరికొత్త అప్‌ డేట్‌ లో భాగంగా వినియోగదారులు తమకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీని నేరుగా ఈ యాప్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాబ్ రిపోర్టులు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు, డిశ్చార్జ్ సమ్మరీలు అన్నీ ఇందులో డిజిటల్‌ గా సేవ్ అవుతాయి కాబట్టి ఇకపై హాస్పిటళ్లకు పేపర్ ఫైళ్లు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్‌ లో ఉన్న గుర్తింపు పొందిన ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులను సులభంగా వెతకవచ్చు. హాస్పిటళ్లలో క్యూ లైన్లలో నిలబడే పనిలేకుండా స్కాన్ అండ్ షేర్ ఫీచర్ ద్వారా ఓపీడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను యాప్‌ లో ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా సులభంగా పే చేయవచ్చు. ఒకే అకౌంట్ ద్వారా ఇంట్లోని పిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రుల మెడికల్ రికార్డులను కూడా భద్రపరచవచ్చు. పీఎం జై పథకానికి అర్హులైన లబ్ధిదారులు తమకు వర్తించే ఉచిత వైద్య సదుపాయాల వివరాలను ఇందులో చెక్ చేసుకోవచ్చు. రోగుల మెడికల్ రికార్డులు వారి పూర్తి అనుమతి ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు షేర్ అవుతాయి. ముఖ్యమైన ఆరోగ్య పత్రాల కోసం ఇందులో డిజీలాకర్ ఫీచర్ ను యాడ్ చేసారు.

Also Read : కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్‌ లు..!

అపాయింట్మెంట్లు, ఇన్సూరెన్స్, మెడికల్ రికార్డుల కోసం వేర్వేరు యాప్‌లు వాడే పనిలేకుండా అన్ని సేవలను ఒకే ఇంటర్‌ ఫేస్ కిందకు తెచ్చారు. భారత్ లో చాలామంది రోగులు పాత రిపోర్టులు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకే టెస్టులను పదే పదే చేయించుకోవాల్సి వస్తోంది. ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గడమే కాకుండా, డాక్టర్లు రోగి యొక్క పాత హెల్త్ హిస్టరీని చూసి సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్న దీర్ఘకాలిక రోగుల ఫాలో-అప్ కేర్‌ కు ఈ యాప్ ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సునీల్ కుమార్ కేసు.....

అధికారి పీవీ సునీల్ కుమార్ తన...

డిజిటల్ ఏపీ.. రాకెట్...

ఏపీని డిజిటల్ రంగంలో నంబర్ వన్‌గా...

కాషాయ పార్టీ స్పెషల్...

దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది....

వైసీపీ నేతలను తరిమి...

అమరావతి... ఇది కేవలం ఒక ప్రాంతం...

తిరుపతిలో భూమన దారుణాలు.....

తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత,...

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

పోల్స్