ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్ గా పాపులర్ అయిన.. బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే అతను ఈ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, స్టోక్స్ కేవలం శారీరక, మానసిక ఒత్తిడి వల్లే తప్పుకున్నాడని పైకి చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన తీవ్రమైన అంతర్గత ఒత్తిడే ప్రధాన కారణమనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
Also Read : ట్రంప్ డిజిటల్ పన్నులు..? భారత్ పై ఎఫెక్ట్..!
ఈ వివాదానికి కొన్ని వారాల క్రితం లండన్ లోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటనే ముఖ్య కారణమని తెలుస్తోంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత క్రమశిక్షణా చర్యల కింద బెన్ స్టోక్స్ తో పాటు గస్ అట్కిన్సన్ ను ఇంగ్లాండ్ బోర్డు రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరం పెట్టింది. ఆ తర్వాత బోర్డు స్వతంత్ర విచారణలో స్టోక్స్ తప్పు లేదని తేలడంతో మూడో టెస్ట్ కు తిరిగి జట్టులోకి తీసుకున్నప్పటికీ, బోర్డు వ్యవహరించిన తీరు, అంతర్గతంగా పెట్టిన కఠిన నిబంధనలు స్టోక్స్ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు ఇంగ్లాండ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : తిరుపతిలో భూమన దారుణాలు.. అడ్డంగా దొరికారా..?
యాషెస్ సిరీస్ లో 4-1తో ఎదురైన ఓటమి, ఆపై కెప్టెన్సీ ఒత్తిడితో ఇప్పటికే సతమతమవుతున్న స్టోక్స్ కు, ఈ నైట్‌క్లబ్ వివాదం మరియు బోర్డు నుంచి వచ్చిన ఒత్తిడి.. లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్.. లాగా మారాయని ఇంగ్లీష్ మీడియా అంటుంది. బోర్డు తన కెప్టెన్సీని ప్రశ్నించడం, చిన్న విషయానికే దూరం పెట్టడం వంటి పరిణామాలు నచ్చకే, 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ కు అతను అర్థాంతరంగా ముగింపు పలికాడనే వార్తలు జోరందుకున్నాయి. ఈ సంచలన నిర్ణయంతో ఇంగ్లాండ్ క్రికెట్ లో బోర్డు వర్సెస్ ఆటగాళ్ల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

