Friday, June 19, 2026 08:45 PM
Friday, June 19, 2026 08:45 PM

సాయికృష్ణ కేసులో వైసీపీ అసలు ఆసక్తి వేరే..!

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసుపై వైసీపీ చేస్తున్న రాజకీయాలు అందరికీ అర్ధమవుతున్నాయి. సాయికృష్ణ కుటుంబానికి సాయం చేయడం కంటే.. పొలిటికల్‌ మైలేజ్‌ సాధించాలన్న తాపత్రయమే వైసీపీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పనిలో పనిగా లిక్కర్‌ కేసులో జగన్‌ అండ్‌ కో గుట్టు బయటపెట్టిన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుని.. బ్లూ మీడియా నేరుగా టార్గెట్‌ చేస్తోంది. సాయికృష్ణ కేసుతో బెజవాడ సీపీకి నేరుగా ఏ సంబంధం లేకపోయినా.. మేం అధికారంలోకి వచ్చాక ఆయన అంతు చూస్తామంటూ.. వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు.

Also Read : బ్రేకింగ్: కొడాలి అరెస్ట్ కు రంగం సిద్దం..?

ఇక్కడ సాయికృష్ణ తల్లికి అండగా నిలవడం వైసీపీ కాన్సెప్ట్‌ కాదు. నేరస్తుడికి కులం రంగు పూసి.. రాజకీయ లబ్ది పొందడం ఫస్ట్‌ ఫ్రయారిటీ. పనిలో పనిగా.. లిక్కర్ కేసు తీగ లాగి.. డొంక కదిలించి.. అవినీతి సొమ్ము మూలాల్ని తాడేపల్లి ప్యాలెస్‌ గేటు లోపలికి వరకు తీసుకెళ్లిన సిట్‌ ఛీఫ్‌ని టార్గెట్‌ చేయడమే గొడ్డలి పార్టీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. బర్త్‌డే పార్టీలో ఫుల్లుగా తాగి.. గిల్లి కజ్జాలు పెట్టుకొని.. ఒక యువకుడిని బీరు సీసాలతో అతి కిరాతకంగా చంపిన సాయికృష్ణ మీద అంత సానుభూతి చూపిస్తున్న వైసీపీ నాయకులు.. అతని చేతిలో హత్యకు గురైన నవీన్‌రెడ్డి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. బీరు సీసాలతో కొట్టి చంపడమే కాకుండా.. రక్తంమడుగులో పడున్న నవీన్‌రెడ్డి విజువల్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రాక్షస చరిత్ర ఈ సాయికృష్ణది.

అలాంటి కిరాతకుడికి సామాజిక వర్గం ముసుగేసి.. అందరూ అండగా నిలవాలనడం.. ఏ రకమైన న్యాయమే వైసీపీ వాళ్లకే తెలియాలి. కన్నతల్లికి తిండి పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా అని ప్రత్యర్ధులను విమర్శించడం వైఎస్ రాజశేఖరరెడ్డి అలవాటు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తీరు కూడా ఆ సామెత లాగే ఉంది. జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన నవీన్‌రెడ్డిని దారుణంగా చంపేస్తే.. అతనికి న్యాయం చేయాలన్న ఆలోచన కూడా రాని వైసీపీ నాయకులకు.. సాయికృష్ణ మీద ప్రేమ పొంగి పోతుందని చెబితే.. నమ్మే వాళ్లెవరూ లేరు.

Also Read : మరో రెండు ముక్కలవుతున్న శివసేన..!

రాజకీయ ప్రయోజనాల కోసమే డ్రామాలు చేస్తున్నారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కూటమి పార్టీల్లో కులాల చిచ్చు పెట్టాలని చూస్తే.. చివరికి నవీన్‌రెడ్డి చంపిన రౌడీ షీటర్‌కు సపోర్ట్‌ చేస్తున్నందుకు వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలని రెడ్డి సామాజికవర్గం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు వైసీసీ నాయకుల దగ్గర గానీ.. ఆ పార్టీ అనుకూల సోషల్‌ మీడియా దగ్గర గానీ సమాధానం లేదు. పెద్దలు ఎప్పుడో చెప్పారు చెడపకురా చేడేవు అని. అయినా మంచి మాటలు పాటించి.. మంచి పనులు చేస్తే అది వైసీపీ ఎందుకు అవుతుంది చెప్పండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్