Thursday, September 17, 2026 10:45 PM
Thursday, September 17, 2026 10:45 PM

అవి చేసే ముందు.. నటి ఘాటు వ్యాఖ్యలు..!

‘కాంతార చాప్టర్-2’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ నకిలీ వీడియోల వ్యవహారంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆమె ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న 29 ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారహంటూ నటి రుక్మిణి వసంత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వేరే వారి శరీరానికి తన ముఖాన్ని అతికించి, ఫేక్ విజువల్స్ సృష్టించారని రుక్మిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య తనను తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, ఉద్దేశపూర్వకంగా తన క్యారెక్టర్, ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేందుకే ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

రుక్మిణి వసంత్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, 9 ఇన్‌స్టాగ్రామ్, 14 ‘ఎక్స్’, 6 ఫేస్‌బుక్ పేజీలతో సహా మొత్తం 29 ఖాతాలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ చట్టంలోని సెక్షన్లు 66సి, 66డితో పాటు భారతీయ న్యాయ సంహిత.. బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై గతంలోనే రుక్మిణి ఘాటుగా స్పందించారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న చిత్రాలు పూర్తిగా ఫేక్ అని, వాటిని ఏఐ టెక్నాలజీతో సృష్టించారని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పష్టం చేశారు. “ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం, వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యం. ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే” అని ఆమె పేర్కొన్నారు.

Also Read : రాజ్యసభ కోసం బీజేపీ భారీ మాస్టర్ ప్లాన్..!

టెక్నాలజీని మంచి పనులకు వాడాలని, ఇలాంటి హానికరమైన కార్యకలాపాలకు కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. రుక్మిణి వసంత్.. 2007లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన అశోక చక్ర గ్రహీత, దివంగత కల్నల్ వసంత్ వేణుగోపాల్ కుమార్తె. ఆయన స్ఫూర్తిగానే ‘యూరి’ అనే బాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది. రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ప్రముఖ భరతనాట్య కళాకారిణి. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే ముందు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని రుక్మిణి వసంత్ భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్