Wednesday, June 3, 2026 08:14 PM
Wednesday, June 3, 2026 08:14 PM

నా పర్సనల్ లైఫ్.. నా ఇష్టం.. మీకెందుకు..!

స్టార్ హీరోయిన్ త్రిష, తమిళనాడు సీఎం విజయ్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై ఇప్పటి వరకు అటు త్రిష, ఇటు విజయ్ రెస్పాండ్ కాలేదు. కానీ తాజాగా త్రిష పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్రిష తన పెంపుడు కుక్క ఫొటో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఆ ఫోటోకు “నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నేను అనుమతించేది దీనికి మాత్రమే” అంటూ రాసుకొచ్చారు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు, తన పర్సనల్ లైఫ్ పై వస్తున్న రూమర్స్‌కు త్రిష పరోక్షంగా సమాధానం ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు.

Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, తన గురించి మాట్లాడుతున్న వారికి ఆ పోస్ట్ ద్వారా త్రిష కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. త్రిష ఇటీవల మ్యాజికల్ మే అంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెల్ఫీలు, పెంపుడు కుక్కతో ఉన్న క్యూట్ మూమెంట్స్, పర్సనల్ మెమోరీస్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెల తనకు చాలా ప్రత్యేకమని త్రిష పేర్కొన్నారు. ఈ నెలలో జరిగిన కొన్ని స్వీట్ మూమెంట్స్ తలుచుకుంటే తనకు ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఆ మెమోరీస్ లైఫ్ లాంగ్ తన ఫేస్ పై చిరునవ్వు తీసుకొస్తాయని ఆమె రాసుకొచ్చారు.

అలాగే వయసు గురించి కూడా త్రిష ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇచ్చారు. 40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడం కంటే, 20 ఏళ్ల యువతులు 40 ఏళ్ల వయసుని చూసి భయపడకుండా ఆ స్టేజ్ కోసం ఎదురు చూసేలా చేయడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. మరోవైపు, త్రిష మ్యాజికల్ మే అని పెట్టడంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మే నెలలో ఆమె పుట్టినరోజు జరుపుకోవడం, అదే సమయంలో విజయ్ రాజకీయ జీవితంలో పెద్ద విజయం సాధించడం వంటి విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆమె ఈ నెలను ప్రత్యేకంగా పేర్కొన్నారేమో అని మాట్లాడుకుంటున్నారు. గతంలో కూడా విజయ్, త్రిష కలిసి కొన్ని కార్యక్రమాల్లో కనిపించారు. ఇటీవల హీరో అజిత్‌ను పరామర్శించేందుకు కూడా విజయ్, త్రిష ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్లారు. దీంతో వీరిద్దరి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

Also Read : రాజ్యసభ కోసం బీజేపీ భారీ మాస్టర్ ప్లాన్..!

అయితే ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలపై ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉంటున్నారు. రూమర్స్ పై స్పందించకుండా తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు త్రిష చేసిన తాజా పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్‌లో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడనని త్రిష చెప్పిన విధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో విజయ్‌తో తనపై వస్తున్న రిలేషన్ షిప్ వార్తలకు త్రిష ఇదే తనదైన స్టైల్లో ఇచ్చిన సమాధానమా అనే చర్చ కొనసాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం భక్తుల కష్టాలు...

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం....

బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా...

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని...

టీడీపీ ఖాతాలో మరో...

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ-3...

గెట్ రెడీ ఫర్...

తెలంగాణలో పోటీపై వస్తున్న పుకార్లకు జనసేన...

రాజ్యసభ కోసం బీజేపీ...

ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో...

పవన్ సభకు బ్రేకులు.....

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

పోల్స్