అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి ఒకడు.. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అచ్చం అలాగే ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ జగన్ చెప్పిన మాటలే. చేసిన పనులకు.. చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన లేన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. సరిగ్గా పది రోజుల క్రితం చేసిన పని మర్చిపోయారు వైఎస్ జగన్. దీంతో ఇప్పుడు జగన్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అయితే.. జగన్‌కు మతిమరుపు వచ్చిందా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ తప్ప..!
చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అది కూడా ఆయనకు పూర్తిగా అనుకూలమైన, ఆయన పిలుపు మేరకు వచ్చిన ఓ పది మంది పాత్రికేయులతో మాత్రమే మీట్ నిర్వహించారు. అక్కడ ఎవరు ప్రశ్నించడానికి లేదు.. ఎవరు మాట్లాడకూడదు కూడా. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైనా కూడా జగన్ మాత్రం బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లోనే ఉన్నారు. ఏదో గొడవలంటూ వైసీపీ నేతలు గగ్గొలు పెట్టడం.. ఇక వైసీపీ అధికారిక పత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ బ్యానర్ ఐటమ్ పెట్టిన తర్వాత.. హడావుడిగా బెంగళూరు నుంచి విజయవాడ వచ్చారు. గవర్నర్‌ను కలిశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
Also Read : కష్టపడిన వారికి గుర్తింపు ఎప్పుడూ..?
అయితే తాడేపల్లి ప్యాలెస్‌లో తన అనుకూల పాత్రికేయులతో కలిసి ప్రెస్ మీట్‌పెట్టిన జగన్.. కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. “ఎంత కుట్రపూరితంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనేది చూస్తే.. రిజర్వేషన్లు ప్రకటించిన రెండో రోజే, నామినేషన్లు ప్రారంభం. దానికి కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చారు. అధికార పార్టీకి రిజర్వేషన్ల గురించి ముందే తెలుసు కాబట్టి, ముందే సిద్ధమయ్యారు. ప్రతిపక్షానికి ఆ అవకాశం లేదు. అయినా విపక్షం సిద్ధమైతే, నామినేషన్లు వేయనీయడం లేదు.” అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. జగన్‌కు మతిమరుపు వచ్చిందనే మాటకు కారణమయ్యాయి కూడా.
Also Read : తిరువూరు కూటమిలో అసమ్మతి.. కొలికపూడి రచ్చ..!
ఎందుకంటే జగన్ చెప్పినట్లుగా రిజర్వేషన్లు ప్రకటించిన రెండో రోజే నామినేషన్లను ప్రారంభించారు. అయితే ఇక్కడే జగన్ తీరు ఏ మాత్రం అర్ధం కావటం లేదు. ఎందుకంటే.. రిజర్వేషన్లు ప్రకటించడానికి వారం ముందే.. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును వైసీపీ ప్రకటించింది. అంటే నెల్లూరు సీటు జనరల్‌కు కేటాయిస్తారని జగన్‌కు ముందే తెలుసన్న మాట. అలాగే శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మిదేవిని బరిలోకి దింపాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక విశాఖలో కూడా వరుదు కల్యాణి పేరును ముందు నుంచే ప్రచారంలోకి తీసుకువచ్చారు. అంటే.. ఎక్కడ ఎవరు పోటీ చేయాలో జగన్ ముందు నిర్ణయించారు. అంటే రిజర్వేషన్ ప్రకటన ముందే జగన్‌కు తెలుసన్న మాట. ఓ మాజీ ముఖ్యమంత్రికి తెలియటం పెద్ద విశేషమేమి కాదు. కానీ నాకు ఏమీ తెలియదని బేల పలుకులు పలకటం మాత్రం ఇప్పుడు పెద్ద విడ్డూరంగా ఉంది.


