Saturday, October 17, 2026 07:08 PM
Saturday, October 17, 2026 07:08 PM

కష్టపడిన వారికి గుర్తింపు ఎప్పుడూ..?

మేయర్, చైర్మన్ టికెట్ల కేటాయింపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. ఇంకా చెప్పాలంటే.. అసలు కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వటం లేదనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన మొదలు.. సీట్ల పంపకం, టికెట్ల కేటాయింపు వరకు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేస్తూనే ఉంది. కొన్ని చోట్ల పార్టీ పెద్దల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. కొన్ని చోట్ల మాత్రం.. పార్టీ పదవులకు, సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. చివరికి పార్టీకి కంచుకోట లాంటి చోట కూడా కష్టపడిన వారికి కాకుండా.. కొత్తగా వచ్చిన వారికి, అనుయాయులకే టికెట్లు ఇప్పించటం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Also Read : ముంబై ఇండియన్స్‌కు జయవర్ధనే గుడ్‌బై..!

స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలవుతున్నాయి. అయితే చాలా చోట్ల ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చివరికి రాజకీయాలకు కేంద్రంగా భావించే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. పార్టీకి తొలి నుంచి సేవ చేసిన వారికి, జెండా మోసిన కార్యకర్తకు ఏ మాత్రం విలువ ఇవ్వటం లేదని.. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేద ప్రధాన ఆరోపణ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే కనీసం ఒక్క కమ్మ సామాజిక వర్గానికి నేతకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి తొలి నుంచి ఉంది. రెండు మంత్రి పదవులు బీసీలకే ఇచ్చారని.. ఇప్పుడు విజయవాడ మేయర్‌ కూడా కాపు సామాజిక వర్గానికి కేటాయించారనేది ప్రధాన ఆరోపణ.

ఉన్న రెండు మేయర్ స్థానాలు కూడా ఒకటి కాపు, మరొకటి బీసీలకు ఇస్తే.. మరి మా సంగతేంటి అనేది కమ్మ సామాజిక వర్గం నేతల ప్రశ్న. జిల్లాలో మిగిలిన చోట్ల కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదంటున్నారు. జగ్గయ్యపేట మునిసిపాలిటీలో చైర్మన్ పదవిని ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరికే ఇవ్వటాన్ని టీడీ జనార్థన్, నెట్టెం రఘురామ్, సామినేని ఉదయభాను వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కమ్మ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం జగ్గయ్యపేట. అలాంటి చోట ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్మన్ పదవులు రెండూ ఆర్యవైశ్యులకు.. అది కూడా ఒకే కుటుంబానికి ఎలా ఇస్తారనేది పార్టీ నేతల ప్రశ్న. నిజానికి జగ్గయ్యపేట మునిసిపల్ రేసులో తొలి నుంచి జనసేన తరఫున సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమలతో పాటు టీడీపీ తరఫున ఆచంట సునీత పేరు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరినీ కాదని.. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరి నరేంద్రుల వినీతకు చైర్‌పర్సన్‌గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో అటు కమ్మ, ఇటు కాపు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పిల్లలు ఇంటర్నెట్ వాడటంపై సుప్రీం సంచలన తీర్పు

ఏలూరు మేయర్ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఏలూరులో జనసేన పార్టీకి సరైన ప్రాతినిధ్యమే లేదు. అయినా సరే.. ఏలూరు మేయర్ స్థానాన్ని జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏలూరు పరిశీలకులు పంచుమర్తి అనురాధ ఎదుట తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం కూడా జారీ చేశారు. వరుసగా ఉన్న కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మేయర్ స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీకి దక్కలేదు. రాజమండ్రి బీజేపీకి కేటాయించగా.. కాకినాడ, ఏలూరు, విజయవాడలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పార్టీ పెద్దల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ఇక గుంటూరు మేయర్ స్థానంపై కూడా ఇప్పటి వరకు అభ్యర్థి ఫైనల్ కాకపోయినప్పటికీ.. మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజా పేరును టీడీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారనే ఒకే ఒక కారణంతో శైలజకు టికెట్ ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. నిజానికి శైలజకు ఇప్పటి వరకు టీడీపీ సభ్యత్వం కూడా లేదని.. అయినా సరే.. మళ్లీ శైలజాకు టికెట్ ఎలా ఇస్తారనేది సూటి ప్రశ్న. పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు రావటం లేదని.. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పునరాలోచించాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్