ఏపీలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా..? ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందా..? వ్యవస్థలన్నీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో ఉన్నాయా..? ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలా..? ఈ ప్రశ్నలకు జవాబులు ప్రజలే చెబుతున్నారు. ఏపీలో రౌడీ రాజ్యం ఉందని.. ప్రశాంతంగా ఎన్నికలు జరగటం లేదని.. అమాయకులైన వైసీపీ నేతలు, కార్యకర్తలను రాక్షసులైన టీడీపీ మూకలు కత్తులు, కర్రలతో దాడులు చేస్తున్నారని నిస్సిగ్గుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నారా సుర రక్తచరిత్ర అంటూ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : కష్టపడిన వారికి గుర్తింపు ఎప్పుడూ..?
మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన చోట్ల చాలా ప్రశాంతంగా నామినేషన్లు ముగిశాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ చెదురుమదురు ఘటనలు కూడా ఎక్కడ జరిగాయనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. అసలు గొడవలు మొదలైంది పుంగనూరులో. అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గొడవలకు అసలు కారణం.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయం గేట్లు ఢీ కొట్టి నేరుగా లోపలికి రావడం.. టీడీపీ కార్యకర్తలను కారుతో ఢీ కొట్టడం వల్లే గొడవ పెద్దైంది.
Also Read : ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా వేరే..!
ఇక పులివెందులలో ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్కడ కూడా నామినేషన్ల సందర్భంగా గొడవలు జరిగాయి. చివరికి కాల్పుల వరకు పరిస్థితి చేరుకుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ అభ్యర్థి వైఎస్ విమల తొలిరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆరోజు ఏ ఇబ్బంది రాలేదు. కానీ.. టీడీపీ నేతలు నామినేషన్ వేసేందుకు వచ్చిన సమయంలోనే ఎంపీ అవినాష్ అనుచరులతో కలిసి కార్యాలయం వద్దకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఆయన అలా రాకపోతే.. గొడవ జరిగేదే కాదు. కడపలో కూడా వైఎస్ అవినాష్ చేసిన హంగామా వల్లే అక్కడ కూడా గొడవలు జరిగాయి.
Also Read : కేంద్ర బలగాల కోసమే వైసీపీ మైండ్ గేమ్..?
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినేయ్ రెడ్డి చేసిన పని అందరూ చూశారు. టీడీపీ మహిళ అభ్యర్థి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని దాడికి తెగబడ్డాడు. అక్కడ ఎంపీ గురుమూర్తి కూడా వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇక ప్రకాశం జిల్లా దర్శిలో కూడా దాడులు జరిగాయి. ఎందుకంటే.. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ తరఫునే పోటీ చేశారు. అక్కడ కూడా రాళ్ల దాడి చేసి ఏకంగా ఎస్సై తల పగలగొట్టారు వైసీపీ మూకలు. రాయచోటిలో దాడులకు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కారణం. అది కూడా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ మినహా.. రాష్ట్రంలో మరెక్కడా నామినేషన్ల సమయంలో గొడవలు జరగలేదు.
విశాఖలో వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ కూడా చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు చేశారు. నామినేషన్లు వేశారు. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేవు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్న చోట మాత్రమే గొడవలు, రాళ్ల దాడి, కాల్పుల వరకు పరిస్థితి చేరుకుంది. పుంగనూరు, రాయచోటి, పులివెందులలో జరిగిన నాలుగు ఘటనలను ఉదాహరిస్తూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరటం మరీ విడ్డూరం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మదనపల్లెలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు కలిసే నామినేషన్ దాఖలు చేశారు. అది కూడా ఒకేసారి. ఇద్దరు సరదాగా నవ్వుతూ ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు కూడా. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఇవన్నీ వైసీపీ నేతలకు కనిపించటం లేదా..?


