ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేయడం ఎవరూ ఊహించలేదు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు కొంతమంది పనిగట్టుకుని మరీ పని చేస్తున్నారు. కొందరు జనసేన పార్టీ నేతలు కూడా ఇందుకు తెర వెనుక నుంచి సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
Also Read : జగనన్న.. ఈసారి వాళ్లకు టికెట్లు ఇస్తారా.. లేదా..?
కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ పాత్ర కీలకం అనేది అందరూ ఒప్పుకుంటారు. అదే సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వ్యవహారం కూడా ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. ఇక యువగళం పాదయాత్ర మరో ప్లస్ పాయింట్. ఇవే కూటమి గెలుపులో కీలకం. అయితే కొందరు జనసేన ముసుగు వేసుకున్న తోడేళ్లు మాత్రం.. జనసేన లేకపోతే టీడీపీ గెలుపు కష్టమని.. అసలు టీడీపీకి అంత సీన్ లేదని కూడా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక కొందరైతే.. పవన్, లోకేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని కూడా అంటున్నారు. ఇది పరోక్షంగా టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకే అనేది బహిరంగ రహస్యం.
Also Read : రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ తప్ప..!
అయితే అవేవీ నిజం కాదని టీడీపీ నేతలు ఇప్పుడు రుజువు చేశారు. ఇదే సమయంలో జనసేన నేతల ముందు ఒక పెద్ద టాస్క్ కూడా పెట్టారు. మునిసిపల్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లోనే జనసేన పార్టీ బోణీ కొట్టేసింది. అది కూడా ఏకగ్రీవంగా… ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దగ్గరుండి మరీ జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించారు. అక్కడ వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రాలేదు. ఆ మాదిరిగా గొట్టిపాటి లక్ష్మి రాజకీయం నడిపించారు. జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వటంలో గొట్టిపాటి లక్మితో పాటు టీడీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు.
Also Read : ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా వేరే..!
ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా జనసైనికులకు ఓ సవాల్‌గా మారింది. ఎందుకంటే.. ఏపీలో 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రెండు చోట్ల జనసేన ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి డిప్యూటీ సీఎంతో కలిసి మూడు మంత్రిపదవులు ఉన్నాయి. టీడీపీ ఇంఛార్జ్ నియోజకవర్గంలోనే ఏకగ్రీవం అయితే.. ఇక జనసేన మంత్రుల నియోజకవర్గం పరిధిలోని మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే.. ఆ నేతల పరువు ఏం కాను.. అనే మాటలు వినిపిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో, కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే.. అది ఆ పార్టీ నేతలకే తలవంపులు అనే మాట బాగా వినిపిస్తోంది. మరి జనసేన నేతలు వారి నియోజకవర్గాల్లో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.


