Thursday, October 15, 2026 09:35 PM
Thursday, October 15, 2026 09:35 PM

నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీ.. కేంద్రం సంచలన నిర్ణయం..!

మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫోన్‌కు ఎలాంటి అపరిచిత నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా, సదరు వ్యక్తి అసలు పేరు మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షం కానుంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ.. నవంబర్ 1, 2026 నుంచి దేశంలోని మొబైల్ యూజర్లందరికీ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Also Read ; కేసుల ఉచ్చు బిగుస్తోందా? ఒత్తిడితో జగన్ ఉక్కిరిబిక్కిరి..!

ఇప్పటివరకు అపరిచిత నంబర్ల వివరాలను తెలుసుకోవడానికి మెజారిటీ జనాలు ట్రూకాలర్ లాంటి థర్డ్-పార్టీ యాప్స్‌పై ఆధారపడేవారు. కానీ వాటిల్లో పేర్లు తప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కేంద్రం తెస్తున్న ఈ నయా విధానం ద్వారా, ఒక నంబర్ కొనేటప్పుడు వినియోగదారుడు సమర్పించిన అధికారిక గుర్తింపు పత్రాల ఆధారంగా టెలికాం కంపెనీల డేటాబేస్‌లో నమోదైన అసలు పేరు మాత్రమే ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. నవంబర్ 1 నుంచి 4G, 5G నెట్‌వర్క్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ ఎలాంటి అభ్యర్థనలు లేకుండానే బై-డిఫాల్ట్‌గా యాక్టివేట్ కానుంది.

Also Read ; N95 మాస్క్‌లు ధరిస్తే మీ ఊపిరితిత్తులు సేఫ్..?

ప్రస్తుతం దేశంలో ఇన్సూరెన్స్, లోన్స్ పేరిట వచ్చే స్పామ్ కాల్స్, అపరిచిత నంబర్ల ద్వారా సాగుతున్న సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. కాల్ చేస్తోంది ఎవరో ముందే తెలిసిపోతుంది కాబట్టి, మోసాలకు అడ్డుకట్ట వేయడం సులువవుతుంది. వ్యాపార సంస్థలు మరియు బల్క్ కనెక్షన్లు వాడుకునే వారు తమ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ లేదా జీఎస్టీ పోర్టల్‌లో ఉన్న వ్యాపార పేరును ప్రదర్శించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం సాధారణ మొబైల్ యూజర్లకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

కేసుల ఉచ్చు బిగుస్తోందా?...

ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక కేసుల్లో చోటుచేసుకుంటున్న...

అర్ధరాత్రి ట్వీట్ చేసిన...

ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

వంశీపై యార్లగడ్డ సంచలన...

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండే...

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

పోల్స్