Thursday, October 15, 2026 09:41 PM
Thursday, October 15, 2026 09:41 PM

మారుతి బ్రెజ్జా సరికొత్త చరిత్ర.. ఓ రేంజ్ లో సేల్స్..!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త రికార్డును సృష్టించింది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి బ్రెజ్జా మొత్తంగా 15 లక్షల యూనిట్ల విక్రయాల భారీ మైలురాయిని అధిగమించింది. ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటి నుండి కస్టమర్ల ఫేవరెట్ ఛాయిస్‌గా నిలిచిన బ్రెజ్జా, ప్రస్తుతం తన సెకండ్ జెనరేషన్ లో మార్కెట్ ను శాసిస్తోంది.

ALso Read : అర్ధరాత్రి ట్వీట్ చేసిన జగన్.. క్యాడర్ కు లీకులు ఇస్తున్నట్టా..?

బ్రెజ్జా విజయ ప్రస్థానంలో మరో విశేషం ఏంటంటే, మారుతి సుజుకి ఇంజనీర్లు పూర్తిగా భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఇటీవల ఈ మోడల్‌కు చేసిన మిడ్-సైకిల్ అప్‌డేట్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జూలై 2026లో లాంచ్ అయిన ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్, మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఏకంగా 1 లక్షకు పైగా బుకింగ్స్ సాధించి తన హవాను కొనసాగిస్తోంది. బ్రెజ్జాకు మార్కెట్లో ఉన్న క్రేజ్ ఎంతలా ఉందంటే, దాదాపు 56 శాతం మంది కస్టమర్లు తమ కొత్త కారు కొనుగోలు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే బ్రెజ్జాను కొనాలని డిసైడ్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read : బెజవాడ పాలిట్రిక్స్.. రాధ ఫిక్స్.. లైన్‌లోకి బోండా..!

ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, న్యూ బ్రెజ్జా రెండు పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉన్నాయి. కస్టమర్లు దీనిని పెట్రోల్ తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. బూట్ స్పేస్ ఎక్కువ వచ్చేలా ఈసారి అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ను అమర్చారు. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో వస్తున్న ఈ కారు ధర బేస్ వేరియంట్ రూ. 7.50 లక్షల నుండి టాప్ వేరియంట్ రూ. 13.70 లక్షల వరకు ఉంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కార్లకు బ్రెజ్జా గట్టి పోటీని ఇస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

కేసుల ఉచ్చు బిగుస్తోందా?...

ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక కేసుల్లో చోటుచేసుకుంటున్న...

అర్ధరాత్రి ట్వీట్ చేసిన...

ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

వంశీపై యార్లగడ్డ సంచలన...

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండే...

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

పోల్స్