Wednesday, October 14, 2026 07:01 PM
Wednesday, October 14, 2026 07:01 PM

హైదరాబాద్ టీ20 ముంగిట తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..!

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా నాలుగో టీ20 పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో టీం ఇండియా లీడ్‌లో ఉన్నప్పటికీ.. ఇండోర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ పుంజుకుని భారత్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు టీం ఇండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ తన సహచర ఆటగాళ్లను అప్రమత్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ లాంటి ప్రమాదకరమైన జట్టుతో తలపడేటప్పుడు ఒక్క క్షణం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తిలక్ హెచ్చరించాడు.

Also Read : బాబు బాటలో విజయ్‌.. తమిళనాడులో రచ్చ రచ్చ

గత మ్యాచ్‌లో జరిగిన తప్పులపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు సభ్యులకు క్లాస్ పీకినట్లు తిలక్ వర్మ వెల్లడించాడు. “టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టు. ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే మ్యాచ్‌ను చేతుల్లోంచి లాగేసుకుంటారు. గత మ్యాచ్‌లో మేము చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే ఓడిపోయాం. అందుకే కోచ్ గౌతమ్ గంభీర్ మాకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.. మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ పట్టు సడలించవద్దని, పూర్తి దూకుడుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు” అని తిలక్ పేర్కొన్నాడు.

Also Read : జగన్ కు మ్యూజిక్ స్టార్ట్ అయిందా..?

గంభీర్ మార్క్ అగ్రెసివ్ ఆలోచనలతోనే తాము ఈ మ్యాచ్‌లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేశాడు. హైదరాబాద్ తిలక్ వర్మకు సొంత మైదానం కావడంతో ఉప్పల్ స్టేడియంలో ఆడటంపై అతను హర్షం వ్యక్తం చేసాడు. ఇక్కడి పిచ్, వాతావరణంపై తనకు పూర్తి అవగాహన ఉందని, స్థానిక ప్రేక్షకుల మద్దతు తమకు అదనపు బలాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గత మ్యాచ్ ఓటమి నుంచి తాము త్వరగానే కోలుకున్నామని, హైదరాబాద్ వేదికగానే ఈ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో జట్టు మొత్తం ఉందని తిలక్ వర్మ తెలిపాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

కూటమిలో ముదురుతున్న స్థానిక...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్...

పోల్స్