Monday, October 19, 2026 09:13 PM
Monday, October 19, 2026 09:13 PM

టాటా కార్లపై ఏకంగా 3.35 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్లు..!

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దసరా, దీపావళి పండగ సీజన్ల వేళ సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. అక్టోబర్ నెలలో కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ప్యాసింజర్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియోపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్, కస్టమర్ బెనిఫిట్స్ మరియు స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ రూపంలో ఈ పండగ రాయితీలను టాటా మోటార్స్ అందిస్తోంది.

Also Read : సల్మాన్ ఖాన్ కనెక్షన్‌ టైగర్ ష్రాఫ్‌ కొంప ముంచిందా..?

ఈ పండగ సీజన్ లో టాటా కర్వ్ ఈవీ మోడల్ పై అత్యధికంగా 3.35 లక్షల రూపాయల వరకు భారీ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అలాగే సరికొత్త హారియర్ ఈవీ మోడల్ పై 2.75 లక్షల రూపాయల వరకు తగ్గింపును ప్రకటించారు. పాపులర్ ఎలక్ట్రిక్ కార్ అయిన పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్లపై 1.45 లక్షల రూపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెక్సాన్ ఈవీపై 45 వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ భారీ ఆఫర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

Also Read : వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..!

ఎలక్ట్రిక్ కార్లతో పాటు రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ కార్లపై కూడా టాటా మంచి ఆఫర్లను ఇస్తోంది. టాటా నెక్సాన్ పెట్రోల్ మాన్యువల్ మోడళ్లపై 75 వేల రూపాయల వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై 60 వేల రూపాయల వరకు తగ్గింపు ఉంది. ఇక మిడ్ సైజ్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీ కార్లపై 45 వేల రూపాయల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. చిన్న కార్ల విభాగంలో టాటా ఆల్ట్రోజ్ పై 55 వేల రూపాయల వరకు, టియాగో మరియు టిగోర్ మోడళ్లపై 30 వేల నుండి 35 వేల రూపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి. అయితే టాటా పంచ్ పెట్రోల్ మోడల్ పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. నగరాలు మరియు డీలర్‌షిప్‌లను బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సిక్కోలు వైసీపీకి షాక్.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

వైసీపీకి షాక్ ఇచ్చిన...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,...

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

పల్లె పండుగ రోడ్డు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె...

జనసేనకు టీడీపీ సవాల్.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి....

జగన్.. వారం క్రితం...

అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి...

పోల్స్