Thursday, September 17, 2026 10:43 PM
Thursday, September 17, 2026 10:43 PM

గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

తెలంగాణలో పోటీపై వస్తున్న పుకార్లకు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని తేల్చేశారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న పవన్.. రాబోయే ఎన్ని ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపితో పొత్తుపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు చేసిన ప్రకటనను గుర్తు చేసిన పవన్.. జీహెచ్ఎంసీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే.. జనసేన కూడా ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Also Read : రాజ్యసభ కోసం బీజేపీ భారీ మాస్టర్ ప్లాన్..!

హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి అనుమతి నిరాకరించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వేల మందితో మీటింగ్ పెట్టుకుని మేం ఏదో చేస్తామని భయపడుతున్నారన్నారు. తెలంగాణలో తిరగనిచ్చేది లేదని కొందరు బెదిరిస్తున్నారన్న పవన్.. తెలంగాణలోకి రావాలంటే పాస్ పోర్టు తీసుకోవాలా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారతదేశాన్ని ఒక యూనిట్‌గా చూస్తానన్న పవన్.. ప్రాంతాలు వేరుగా చూడనని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో ఎక్కడైనా తిరుగుతా అన్నారు. 2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందన్నారు.

Also Read : గెట్ రెడీ ఫర్ ఐ మ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్..!

తెలంగాణ వాదం ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు పవన్. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నోసార్లు అన్నారని పపన్ గుర్తు చేశారు. జనగనమణ పాడితే బెంగాలి అయిపోతారా.. అని నిలదీశారు. ప్రస్తుత గొడవలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రమేయం ఉందని తాను అనుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఐ లవ్ పాకిస్తాన్ అంటే.. దానిపై ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. తాను తెలంగాణలో పోటీ చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించిన పవన్.. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎలా పోటీ చేశారన్నారు. ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారన్న పవన్.. తెలంగాణకు చెందిన పీవీ నరసింహరావు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి ఎంపీగా పార్లమెంట్‌కకు ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాాణ భారతదేశంలో భాగమని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్