Tuesday, July 7, 2026 11:24 PM
Tuesday, July 7, 2026 11:24 PM

గ్రీన్ కార్డ్ ఆశావహులకు అమెరికా బిగ్ షాక్..!

అమెరికాలో అడుగు పెడితే.. గ్రీన్ కార్డ్ రావాల్సిందే అన్నట్లు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియకు సంబంధించి షాక్ ఇచ్చే కొత్త నిబంధనలను శనివారం జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై టూరిస్ట్, స్టూడెంట్ లేదా టెంపరరీ వర్కర్ వీసాలపై అమెరికాలో ఉంటూ, అక్కడికక్కడే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని దాదాపు రద్దు చేశారు.

Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..? 

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఇస్తామని, మిగిలిన వారందరూ తప్పనిసరిగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి, అక్కడి యూఎస్ కాన్సులేట్ల ద్వారానే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లూప్‌ హోల్స్ వాడుకుని చాలామంది తాత్కాలిక వీసాలపై వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారని, ఆ విధానానికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇమ్మిగ్రేషన్ ప్రతినిధి జాక్ కాహ్లర్ వెల్లడించారు.

Also Read : చిదంబరం వర్సెస్ లోకేష్.. అదిరిపోయే కౌంటర్..!

తాత్కాలిక వీసా గడువు ముగిసిన తర్వాత విదేశీయులు అమెరికా వదిలి వెళ్లాలనేది చట్టం అసలు ఉద్దేశమని, తాజా మార్పుతో వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు తిరస్కరణకు గురైన తర్వాత చాలామంది అమెరికాలోనే అక్రమంగా ఉండిపోతున్నారని, కొత్త నిబంధన వల్ల అలాంటి రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ కీలక మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కొత్త విధానం వల్ల అమెరికాలో ఉన్న లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, హెచ్ 1బీ వీసాదారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్