Saturday, May 23, 2026 12:03 PM
Saturday, May 23, 2026 12:03 PM

చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..? 

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. కూటమి రాజకీయం కాస్త ఇంట్రస్టింగ్ గా మారిందనే చెప్పాలి. తాజాగా సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జూన్ 5వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి సంయుక్తంగా తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు.

Also Read : ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్.. ఏపీకి మేలు ఎవరితో..?

అలాగే, జూన్ 21న రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఈ అధికారిక అజెండాతో పాటు రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన మరో అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును బీజేపీకి కేటాయించాలని, ఆ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం.

Also Read: పంచాయితీ రాజ్ శాఖలో వారిదే పెత్తనం..!!

అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే రాజ్యసభ స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొందని, అందువల్ల ఈసారికి బీజేపీకి సీటు కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని చంద్రబాబు ఆయనకు సున్నితంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటులో సైతం కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తామని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందనే దానికంటే కూటమి విజయాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం వారికి వివరించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

పోల్స్