సగ్గం అనంతలక్ష్మీ కుమార్.. ఇది మహిళ పేరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు ఎవరీ అనంతలక్ష్మీ కుమార్.. అని ఆరా తీస్తే.. అంతా నివ్వెరపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనంత లక్ష్మీకుమార్ పేరు మారుమోగిపోతోంది. నిన్నటి వరకు అనంత లక్ష్మీకుమార్ పేరు ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం మోత మోగుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఈయన ఆస్తులే. ఇవి సక్రమ ఆస్తులు అనుకుంటే మళ్లీ పొరపాటు పడినట్లే.. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్ల ఆస్తులను పోగేశారు. ఈయనే హైదరాబాద్ జలమండలి ప్రాజెక్టు డివిజన్ – 3 ఇంజనీరింగ్ విభాగం జనరల్ మేనేజర్.
Also Read : అధికారం కోసం కొత్త దారులు.. జగన్, కేసీఆర్ నయా స్కెచ్..!
ఈయన ఇంటిపై ఆకస్మిక దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి బిత్తరపోయారు. ఇంట్లో ఏ మూలలో చూసినా డబ్బు కనిపిస్తుంది. ఏ బీరువా తెరిచినా సరే.. బంగారం, నగలు. సాధారణంగా ప్రజలు నీటి కుళాయి తిప్పితే నీళ్లు వస్తాయో రావో తెలియదు కానీ.. జీఎం అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో మాత్రం కాసులు గలగలా రాలుతున్నాయి. ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాల్సిన జీఎం అనంతలక్ష్మీ కుమార్.. అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టారు. ఇప్పుడు ఓ వీడియో ద్వారా అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
కిలోల్లో బంగారం, వెండి ఆభరణాలు, నోట్ల కట్టలు, భూములకు సంబంధించిన దస్తావేజులు, ఇళ్లు.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని. అధికారులే అదిరిపోయే రేంజ్‌లో రూ.500 నోట్ల కట్టలు. ఇంట్లో అందమైన, ఖరీదైన ఫర్నీచర్. ఇవన్నీ లెక్క పెట్టడానికి ఏసీబీ అధికారులకు 24 గంటలు పైగానే సమయం పట్టింది. వీటి విలువను అధికారికంగా వంద కోట్లుగా అంచనా వేస్తున్నారంటే.. ఇక బహిరంగ మార్కెట్‌లో ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించారు అధికారులు. కరెన్సీ కౌంటింగ్ మిషన్లు కూడా ఈ నోట్లు లెక్కించలేక అలిసిపోయాయి. ఈ వ్యవహారం బయటకు రావడానికి సదరు అధికారి ఇటీవల చేసిన ఓ శుభకార్యమే కారణం.
Also Read : బ్రేకింగ్: ట్రంప్.. మోడీ కీలక భేటీ షురూ..?
అనంత లక్ష్మీకుమార్ ఇంట్లో ఇటీవల ఓ వివాహ వేడుక నిర్వహించారు. ఆ పెళ్లికి కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. ఈ పెళ్లి వీడియో ద్వారా ఎంత ఖర్చు చేశారనే లెక్కలు కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించిన తర్వాత కూడా అనంతలక్ష్మీ కుమార్ ఇంట్లో ఏకంగా కోటీ 10 లక్షల రూపాయల నగదు ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ అక్రమ సంపాదన అంతా కేవలం నీటి ట్యాంకర్ల సరఫరా ద్వారానే చేసినట్లు గుర్తించారు. సార్ ప్రతిరోజూ కనీసం 50 వేల రూపాయలు లేకుండా ఇంటికి వెళ్లేవారు కాదంట. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లకు నీరు సరఫరా చేసే ఒక్కో వాటర్ ట్యాంకర్ నుంచి 5 వేల రూపాయలు వసూలు చేసినట్లు తోటి అధికారులు ఆరోపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీటిని వ్యాపారంగా మార్చేసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు సగ్గం అనంతలక్ష్మీకుమార్.

