Wednesday, July 8, 2026 05:27 AM
Wednesday, July 8, 2026 05:27 AM

భారత జనాభాపై ఫస్ట్ పోస్ట్ సంచలన కథనం..!

భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జనాభా విస్ఫోటనం అని మాత్రమే మనకు తెలుసు. కానీ అంతర్జాతీయ మీడియా సంస్థ ఫస్ట్ పోస్ట్ ప్రచురించిన తాజా పరిశోధనాత్మక కథనం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. ప్రపంచ దేశాలను వణికశిస్తున్న గ్లోబల్ ఫెర్టిలిటీ క్రైసిస్ లేదా పడిపోతున్న జననాల రేటు సంక్షోభంలోకి ఇప్పుడు భారత్ కూడా అధికారికంగా అడుగుపెట్టిందని ఈ కథనం హెచ్చరించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు, ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని తన కథనంలో పేర్కొంది.

Also Read : ఏపీలో ప్రభుత్వ బడులకు ఫుల్ క్రేజ్..!

ఒక దేశం లేదా రాష్ట్రంలో ఉన్న జనాభా భవిష్యత్తులో కూడా స్థిరంగా, సమానంగా కొనసాగాలి అంటే.. అక్కడి సంతానోత్పత్తి రేటు కనీసం 2.1 శాతం ఉండాలి. దీనినే సైంటిఫిక్ పరిభాషలో రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. కానీ, ఫస్ట్ పోస్ట్ నివేదిక ప్రకారం.. భారతదేశ సగటు ఫెర్టిలిటీ రేటు ఇప్పుడు 2.0 శాతానికి పడిపోయింది. అంటే దేశ జనాభాను స్థిరంగా ఉంచడానికి కావలసిన కనీస పరిమితి కంటే మనం చాలా కిందకు పడిపోయాం. ప్రస్తుతానికి దేశ జనాభా ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా.. రాబోయే కొద్ది దశాబ్దాలలో మన దేశంలో యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఒక కుటుంబంలో మూడో మరియు నాలుగో బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు లేదా నగదు ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది. దక్షిణ భారతదేశంలో జననాల రేటు జాతీయ సగటు కంటే చాలా వేగంగా పడిపోతుండటం, యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో.. భవిష్యత్తులో రాబోయే మానవ వనరుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఈ చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టింది.

Also Read : అవును.. వాళ్లిద్దరు కలిశారు.. మరి వీళ్లిద్దరూ..?

ఆధునిక సమాజంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, వేగవంతమైన పట్టణీకరణ, మరియు మారుతున్న సామాజిక పోకడల వల్లే యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపట్లేదని ఫస్ట్ పోస్ట్ కథనం స్పష్టం చేసింది. దీనివల్ల పని చేసే యువకుల సంఖ్య తగ్గిపోయి, వృద్ధుల జనాభా భారం పెరిగి.. దేశ హెల్త్‌ కేర్, పెన్షన్ సిస్టమ్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా.. యువతకు తక్కువ ఖర్చుతో కూడిన క్వాలిటీ విద్య, ఉచిత వైద్యం అందించినప్పుడే ఈ గ్లోబల్ ఫెర్టిలిటీ క్రైసిస్‌ కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్