గత కొన్నాళ్ళుగా సంచలనం రేపుతోన్న.. ఘజియాబాద్ పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్యం కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ముందడుగు వేసింది. ఈ నెట్వర్క్ తో సంబంధం ఉన్న ఐదుగురు మైనర్లు సహా నిందితులందరిపై దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జువైనల్ జస్టిస్ బోర్డు ముందు భారతీయ న్యాయ సంహిత, అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్, మరియు ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నివేదికను సమర్పించారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదుల, హ్యాండ్లర్ల ఆదేశాల ప్రకారం ఈ నిందితులు దేశంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాలలో స్పై కెమెరాలను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Also Read : సైనికులకు రొయ్యలు పెట్టండి.. కేంద్రానికి చంద్రబాబు సంచలన లేఖ..!
ముఖ్యంగా ఢిల్లీ కాంట్, సోనిపట్ వంటి కీలక రైల్వేస్టేషన్లలో, సైనిక స్థావరాల సమీపంలో సోలార్ తో పనిచేసే సిమ్ ఆధారిత సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దాదాపు 20 అడుగుల ఎత్తులో స్తంభాలకు అమర్చిన ఈ కెమెరాల ద్వారా రైళ్ల కదలికలు, ప్రయాణికులు, భద్రతా బలగాల కదలికలను నిరంతరం రికార్డ్ చేస్తూ, ఆ లైవ్ ఫీడ్ మొత్తాన్ని పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు చేరవేశారు. కేవలం దృశ్యాలను పంపడమే కాకుండా, నిషేధిత, అత్యంత రక్షిత ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించి.. ఆయా వ్యూహాత్మక ప్రాంతాల ఫోటోలు, వీడియోలతో పాటు వాటి ఖచ్చితమైన జీపీఎస్ కోఆర్డినేట్లను కూడా జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు అవతలికి పంపినట్లు గుర్తించింది.
Also Read : ఐపీఎల్ లో కోహ్లీ సరికొత్త చరిత్ర..!
అంతేకాకుండా, భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా పాక్ ఉగ్రవాదులకు భారత సిమ్ కార్డులను సేకరించి ఇవ్వడంలో కూడా ఈ నిందితులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక నిందితుడైన సుహైల్ మాలిక్ అలియాస్ రోమియో ద్వారా ఈ నెట్వర్క్ నడిచింది. అధికారుల నిఘా నుంచి తప్పించుకోవడానికి మరియు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు. నిందితులు స్థానిక పేద, తక్కువ చదువుకున్న మైనర్లను టార్గెట్ చేశారు. ఒక్కో టాస్క్‌కు రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు ఇస్తూ వారిని ఈ దేశద్రోహ చర్యల్లోకి దించారని గుర్తించారు.

