Monday, May 18, 2026 02:40 PM
Monday, May 18, 2026 02:40 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఏ ఏ శాఖలకు ఛాన్స్..?

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏపీ సర్కార్ ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, దుబారా ఖర్చులను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అయితే, ప్రజలతో నేరుగా సంబంధం లేకుండా, కేవలం కంప్యూటర్లు, ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే విధులు నిర్వహించే కొన్ని నిర్దిష్ట శాఖలకే ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

Also Read : నాడు రాళ్ళ సీమ.. నేడు బంగారు సీమ..!

ఈ విధానం అమలులోకి వస్తే ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లభించే అవకాశం ఉంది. సాఫ్ట్‌ వేర్, డేటాబేస్, ప్రభుత్వ వెబ్‌ సైట్ల నిర్వహణ వంటి పనులన్నీ ఆన్లైన్ లోనే జరుగుతాయి కాబట్టి వీరికి ఇది సులువవుతుంది. అలాగే బడ్జెట్ రూపకల్పన, అకౌంట్స్ అడిటింగ్, జీతాల బిల్లుల ప్రాసెసింగ్ చేసే ఆర్థిక, ప్రణాళికా శాఖ సిబ్బందితో పాటు, సచివాలయంలో ఫైళ్ల కదలికలు చూసే నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల సిబ్బంది కూడా ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చు.

Also Read : విజయ్ సంచలన నిర్ణయం.. ప్రజల కోసం సరికొత్త రూల్స్..!

వీటితో పాటు ప్రెస్ నోట్ల విడుదల, సోషల్ మీడియా పర్యవేక్షణ చూసే సమాచార, పౌర సంబంధాల శాఖ, ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియలు చూసే ఉన్నత విద్యాశాఖ అడ్మిన్ విభాగాలకు కూడా ఈ లబ్ధి చేకూరవచ్చు. మరోవైపు, క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నిరంతరం అత్యవసర సేవలు అందించే పలు కీలక శాఖలకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీస్, హోంశాఖ, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ, క్షేత్రస్థాయి పరిశీలనలు చేసే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు ఇది అస్సలు సాధ్యం కాదు. అలాగే ప్రజా రవాణా చూసే ఆర్టీసీ సిబ్బందికి, టీచర్లు వంటి విభాగాల ఉద్యోగులు యథావిధిగా ఆఫీసులకు, విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం వారానికి రెండు రోజులు ఇంటి నుండి, మిగిలిన రోజులు ఆఫీసుకు వచ్చేలా సరికొత్త హైబ్రిడ్ మోడల్ మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సైనికులకు రొయ్యలు పెట్టండి.....

రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా...

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పోల్స్