Saturday, May 16, 2026 04:24 PM
Saturday, May 16, 2026 04:24 PM

విజయ్ సంచలన నిర్ణయం.. ప్రజల కోసం సరికొత్త రూల్స్..!

తమిళనాడు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి విజయ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాహ ధృవీకరణ పత్రాలు లేదా ఈసీ వంటి పనుల కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల కారిడార్లలో గంటల తరబడి నిలబెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు వారికి పూర్తి గౌరవం ఇస్తూ తప్పనిసరిగా కూర్చునే సౌకర్యం కల్పించాలని, నిలబెట్టి పనులు చేయవద్దని సూచించారు.

ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలను పెంచేలా ఈ సరికొత్త పబ్లిక్ సర్వీస్ నిబంధనలను తీసుకువచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని దాదాపు 580కి పైగా ఉన్న అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తగిన సీటింగ్ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెళ్లాయి. ఇందులో భాగంగా ప్రతి సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్లు లేదా జూనియర్ అసిస్టెంట్ల టేబుల్స్ ముందు ప్రజలు కూర్చోవడానికి కనీసం రెండు కుర్చీలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసారు.

అయితే ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు అయ్యేలా చూసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ నిబంధనల అమలును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా ప్రజలకు కూర్చునే వెసులుబాటు కల్పించకపోయినా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలను నిలబెట్టి మాట్లాడినా సీసీటీవీ విజువల్స్ ఆధారంగా వారిపై కఠిన శాఖాపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్