Friday, May 15, 2026 03:02 PM
Friday, May 15, 2026 03:02 PM

ఎస్ఐఆర్ మూడో దశ.. తెలుగు రాష్ట్రాల్లో పరిశీలన..!

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుంది. అయితే, మంచు ప్రభావిత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లద్దాక్ ప్రాంతాల్లో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐర్ షెడ్యూల్‌ తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఎస్ఐర్ మూడో దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించనున్నారు. అయితే, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూతు తప్పనిసరిగా ఏజెంట్లను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది.

Also Read : మరో మాట నిలబెట్టుకున్న నారా లోకేష్..!

మరోవైపు, మూడో దశ షెడ్యూల్‌ను రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటిటి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జులై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు.

ఇక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో జూన్ 25 నుంచి జులై 24 వరకు ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లనున్నారు. జులై 31న ముసాయిదా జాబితా విడుదల చేసి, అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటించనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లో జూన్ 30 నుంచి జులై 29 వరకు పరిశీలన కొనసాగుతుంది. అక్టోబర్ 7న తుది ఓటరు జాబితా విడుదల కానుంది. అలాగే, నాగాలాండ్‌లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు పరిశీలన ఉండగా, నవంబర్ 22న తుది జాబితా విడుదల చేస్తారు. త్రిపురలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు ఇంటింటి పరిశీలన జరగనుంది. డిసెంబర్ 23న తుది జాబితా విడుదల చేయనున్నారు.

Also Read : బండి భగీరథ్‌ కు బిగుస్తున్న ఉచ్చు.. సంచలన పరిణామం..!

ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జూన్ 28 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. జులై 5న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 4 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది జాబితా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. అదేవిధంగా, దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూన్ 4 నుంచి జూలై 3 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించున్నారు. అనంతరం ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. ఉత్తరాఖండ్‌లో జూన్ 8 నుంచి జులై 7 వరకు ఏజెంట్ల పరిశీలన జరిగి, సెప్టెంబర్ 15న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.

కాగా, బిహార్, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇప్పటివరకు జరిగిన తొలి రెండు దశల్లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 59 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను సేకరించినట్లు ఈసీ పేర్కొంది. ఆ దశల్లో 6.3 లక్షలు బీఎలీలు, 9.2 లక్షల బీఎల్ఏలు పాల్గొన్నట్లు వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో మాట నిలబెట్టుకున్న...

ఏపీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలను...

మహానాడుపై టీడీపీ సంచలన...

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత...

బండి భగీరథ్‌ కు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పొదుపు బాటలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు...

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

పోల్స్