ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరిగిపోతున్న తీరుపై అంతర్జాతీయ ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. గతంలో ఊబకాయం అంటే కేవలం ధనిక దేశాలకే పరిమితమైన సమస్య అనుకునేవారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలలో ఊబకాయం రేటు ఒకే స్థాయిలో స్థిరపడగా.. తక్కువ, మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాలలో మాత్రం ఇది అత్యంత వేగంగా దూసుకుపోతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Also Read : బండి భగీరథ్ కు బిగుస్తున్న ఉచ్చు.. సంచలన పరిణామం..!
ఈ భారీ పరిశోధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 2,000 మంది శాస్త్రవేత్తల నెట్‌వర్క్ ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ రంగంలోకి దిగింది. 1980 నుండి 2024 వరకు అంటే దాదాపు 45 సంవత్సరాల కాలంలో.. 200 దేశాలకు చెందిన 23.2 కోట్ల మంది ఎత్తు, బరువుల డేటాను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నివేదికను సిద్ధం చేశారు. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా వంటి ధనిక దేశాలలో ఒకప్పుడు ఊబకాయం వేగంగా పెరిగినప్పటికీ, సరైన ప్రభుత్వ విధానాలు మరియు ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిపుణులు తెలిపారు.
Also Read : పొదుపు బాటలో ఏపీ సర్కార్.. చంద్రబాబు నుంచి పెమ్మసాని వరకు..!
డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, జర్మనీ వంటి దేశాలలో 1990ల నుంచే ఈ పెరుగుదల వేగం తగ్గడం ప్రారంభమైంది. దీనికి పూర్తిగా భిన్నంగా, సెంట్రల్ ఐరోపా మరియు లాటిన్ అమెరికా వంటి మధ్యతరగతి ఆదాయ దేశాలలో ఊబకాయం రేట్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ దేశాల్లోని పెద్దవారిలో ఊబకాయం రేటు ఏకంగా 30 నుండి 40 శాతానికి చేరుకుంది. ఈ దేశాలలో ఒకవైపు పౌష్టికాహార లోపం ఉంటూనే, మరోవైపు జంక్ ఫుడ్స్ లభ్యత విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారు. తక్కువ ధరకు లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని, దీన్ని అరికట్టడానికి తగిన ఆరోగ్య పాలసీలు అవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

