Thursday, May 14, 2026 02:34 PM
Thursday, May 14, 2026 02:34 PM

పొదుపు బాటలో ఏపీ సర్కార్.. చంద్రబాబు నుంచి పెమ్మసాని వరకు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో ఇంధన ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన జిల్లా పర్యటనల్లో కాన్వాయ్ వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ALso Read : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. లోకేష్ కీలక నిర్ణయం..!

ఈ మేరకు భద్రతా సిబ్బందితో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం ముఖ్యమంత్రే కాకుండా రాష్ట్రంలోని మంత్రులు, ఇతర వీఐపీలు కూడా తమ పర్యటనల్లో వీలైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఇంధన పొదుపు చర్యలపై నేడు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, మరిన్ని కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి మంత్రులు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన కాన్వాయ్‌ ను భారీగా కుదించుకుంటున్నట్లు ప్రకటించారు. తన భద్రతా సిబ్బంది వాహనాలను సగానికి పైగా తగ్గించి, ఇకపై కేవలం రెండు వాహనాలతోనే పర్యటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కూడా తన వాహనాలను తగ్గించినట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంల తరహాలోనే తాము కూడా ఇంధన పొదుపు చర్యల్లో భాగస్వామ్యం అవుతామని మంత్రులు ప్రకటించారు. గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు ఆయన కాన్వాయ్‌లో మరో నాలుగు వాహనాలు ఉండేవి.

ALso Read : దస్తగిరి హ*త్య కేసులో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత

అయితే తాజా నిర్ణయంతో తన వాహన శ్రేణి నుంచి రెండు వాహనాలను తగ్గిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ప్రధాని మోదీ పిలుపు మేరకు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను కుదించుకుంటూ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పెద్దలంతా ఒకేసారి విలాసాలకు, అనవసరపు ఖర్చులకు స్వస్తి పలుకుతూ.. ఇంధన పొదుపు దిశగా కాన్వాయ్ వాహనాలను తగ్గించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

సీమకు రాయల్ కళ.....

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా...

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

పోల్స్