మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వరుస వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్ ప్రస్తావన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యేల వరకు బాలినేని చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో అసంతృప్తిని రేకెత్తించగా, ఆయన వైఖరిపై పార్టీ క్రమశిక్షణ, బాధ్యతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అనవసర వివాదాలకు దారి తీశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా, మాజీ మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన సందర్భంలో అనవసర వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన, పవన్ కళ్యాణ్ చుట్టూ కొంత మంది ఉన్నారని చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో అసంతృప్తిని పెంచాయి. వ్యక్తిగత వ్యాఖ్యల స్థాయికి రాజకీయ చర్చను దిగజార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాను పదవుల కోసం రాలేదని చెప్పినా, అదే సమయంలో పదవుల ప్రస్తావన, వ్యక్తిగత అనుభవాలను రాజకీయ వేదికపై మళ్లీ మళ్లి ప్రస్తావించడం అవసరం లేని వివాదాలను పెంచిందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read : జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?
టీడీపీ ఎమ్మెల్యేలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ సమన్వయానికి విరుద్ధంగా ఉన్నాయని భావిస్తున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం అవసరమైన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒంగోలు రాజకీయాలను ప్రస్తావించిన బాలినేని.. తాను ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానని చెప్పుకున్నారు. రెండు సార్లు ఓటమికి పవన్ కళ్యాణ్‌ను కారణంగా చూపించడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. సామాజిక వర్గాలపైన, టీడీపీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా తీవ్ర విమర్శలకు తెర లేపాయి. కూటమి పార్టీలతో సమన్వయం అవసరమని చెబుతూనే, వేరే పార్టీల నేతలపై వ్యాఖ్యలు చేయడం ద్వంద్వ వైఖరిగా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. పదవులు లేకపోయినా తాను కాంప్రమైజ్ కాబోనని చెప్పిన బాలినేని వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రతికూల చర్చలకు దారి తీశాయి. నాయకత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చలకు దారి తీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒంగోలులో ఏడు సార్లు పోటీ చేశాను, ఐదు సార్లు గెలిచాను.. రెండు సార్లు ఓడిపోయాను. ఆ రెండుసార్లు కూడా తెలుగుదేశం వాళ్లు ఓడించలేదు, పవన్ కళ్యాణ్ ఓడించారు.. అంటూ బాలినేని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఒంగోలులో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ ఉందని, కమ్మ, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్నారు. పదవులు లేకపోయినా ఇంట్లో కూర్చుంటానని కూడా పవన్ కళ్యాణ్‌కు చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అంటూ కామెంట్ చేసిన బాలినేని.. కాకపోతే అక్కడ కొన్ని పరిస్థితులు ఆయన్ని ముందుకు పోనివ్వటం లేదంటూ వ్యాఖ్యానించారు.
Also Read : మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!
కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి కోసం ఎప్పుడైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని స్పష్టం చేశారు. గత ఎన్నికల అనుభవాలను ప్రస్తావించిన బాలినేని.. ఒంగోలు నియోజకవర్గంలో గెలుపు, ఓటములు ఎదురైనా ప్రజలతో, కార్యకర్తలతో ఉన్న అనుబంధం మారలేదని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రజల సమస్యలపై మాట్లాడినందుకు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న ప్రాంతాల్లో గట్టి పోరాటం చేయాలని జనసేన నేతలకు సూచించారు. ఇతర కూటమి పార్టీలతో సమన్వయం అవసరమన్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే సీట్లపై స్పష్టత రావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో మండలాలు, వార్ల స్థాయిలో బలాన్ని గుర్తించి ఎన్నికలకు సిద్ధం కావాలని బాలినేని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాటను బయట పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించినందుకే తాను ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!
బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. జనసేన పార్టీ గతంలో సరిగా నడవలేదన్నట్టుగా.. ఇప్పుడు తాను చక్కదిద్దుతున్నానన్న భావనతో మాట్లాడటం అనవసర విమర్శలకు తెర లేపింది. పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా బాలినేని వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే కాకుండా, పార్టీ నిర్మాణంపై అనవసర వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు, అలాగే పార్టీ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో అసంతృప్తిని పెంచాయి. ఇప్పటికే ఉన్న రాజకీయ సమన్వయ వాతావరణంలో ఇటువంటి వ్యాఖ్యలు అవసరం లేనివంటున్నారు. పార్టీ కార్యాలయ వ్యవస్థ, నాయకత్వ నిర్వహణపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తీశాయి. ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బాలినేని చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా, రాజకీయంగా అనవసర చర్చలకు కారణమయ్యాయని, ఇవి వ్యక్తిగత అభిప్రాయాల స్థాయిని దాటి వివాదంగా మారాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

