Monday, May 11, 2026 12:24 PM
Monday, May 11, 2026 12:24 PM

రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!

ఆర్కే రోజా.. తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు. 1999లో తొలిసారి సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ అధ్యక్షురాలి హోదాలో వ్యవహరించారు. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రోజా.. కాంగ్రెస్ అభ్యర్థి చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా 2009 జూన్ నెలలో నాటి ముఖమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read : మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!

ఇక వైఎస్ఆర్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజా.. 2014, 2019 ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక వైఎస్ జగన్ రెండోసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో రోజాకు అవకాశం దక్కింది. కీలకమైన పర్యాటక, సంస్కృతి, యువజన అభివృద్ధి శాఖ మంత్రిగా రోజా పనిచేశారు. ఆమె పదవీ కాలంలో లెక్క లేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎన్నో విమర్శలు రోజా ఎదుర్కొన్నారు. బాపట్ల బీచ్ సందర్శనకు వెళ్లిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగి చేతికి తన చెప్పులు ఇచ్చారు. ఇక మంత్రిగా ఉన్నప్పుడే నాటి ప్రతిపక్ష నేతలపై నోటికి వచ్చినట్లు రెచ్చిపోయారు. అసభ్యకరమైన సైగలతో దారుణంగా వ్యవహరించారు.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా అరెస్టు ఖాయమని అంతా అనుకున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగిందనేది బహిరంగ రహస్యం. నాసిరకం స్పోర్ట్స్ కిట్లు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు దోచేశారనేది ప్రధాన ఆరోపణ. సుమారు రూ.400 కోట్ల కుంభకోణం జరిగిందనేది తొలి నుంచి వినిపిస్తున్న మాట. క్రీడా శాఖ మంత్రిగా రోజా, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఈ అవినీతికి ప్రధాన కారణమని ఆరోపించారు. కానీ.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

అయితే ఆడుదాం ఆంధ్రలో కుంభకోణం జరిగిన వ్యవహారంపై ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగినట్లు పరోక్షంగా అంగీకరించారు. అయితే నాసిరకం స్పోర్ట్స్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో తన పాత్ర లేదన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ డిసెంబర్ 26, 2023 నుండి ఫిబ్రవరి 13, 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపిన రోజా.. ఆ సమయంలో తామంతా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బిజీగా ఉన్నామన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో.. తమ ఫోకస్ అంతే అటే ఉందన్నారు. కానీ ఆడుదాం ఆంధ్రలో కుంభకోణం జరిగితే.. ఆ తప్పు అంతా నాటి అధికారులదే తప్ప.. తమది కాదన్నారు.

Also Read : సూపర్ ఎల్‌నినో.. భయపెడుతున్న కరువు..!

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన సమయంలో ఐఏఎస్ అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న యువజన సర్వీసులు, క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు జరిగిన సమయంలో ఐఏఎస్ అధికారి హెచ్.ఎం.ధ్యానచంద్ర ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ధ్యానచంద్ర ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రద్యుమ్నను ముఖ్యమంత్రికి కార్యదర్శిగా సీఎంఓలో నియమించారు. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో అరెస్టు అవుతారా అనే ప్రశ్నకు రోజా లేదని జవాబు చెప్పారు. రోజా ధీమా వెనుక ప్రద్యుమ్న పోస్టింగ్ ప్రధాన కారణం.

“ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంలో నిధుల దుర్వినియోగం, నాసిరకం కిట్ల పంపిణీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పటి శాఖాధిపతిగా ఉన్న ప్రద్యుమ్న పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని రోజా ప్రస్తుతం ప్రస్తావించారు. అసలు కుంభకోణానికి కారణం ప్రద్యుమ్న అన్నట్లుగా వ్యాఖ్యానించారు. నాసిరకం కిట్లను నాటి కమిటీ సభ్యులే కొనుగోలు చేశారని.. అరెస్టులు జరిగితే.. ముందు సీఎంఓలో ఉన్న అధికారి నుంచే మొదలుపెట్టాలని పరోక్షంగా ప్రద్యుమ్న గురించి ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు కూటమి సర్కార్ పెద్దలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నను సీఎంఓలో ఎలా నియమించుకున్నారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. రోజా అరెస్టును సీఎం కార్యదర్శి అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీలో బిజీ బిజీగా...

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు...

రైల్వే సొమ్ము నిలువు...

విశాఖ రైల్వేస్టేషన్ కమర్షియల్ విభాగంలో అతిపెద్ద...

ఆపరేషన్ ఆకర్ష్.. మోదీ...

బెంగాల్‌పై ఫోకస్ చేసి మరీ కొట్టారు....

జగన్ స్కెచ్ వర్కవుట్...

2029లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత,...

అసలు విజయ్ చుట్టూ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్...

సీఎం సచివాలయంలో ఉండగా.....

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద...

పోల్స్