Wednesday, August 12, 2026 05:57 AM
Wednesday, August 12, 2026 05:57 AM

బ్రేకింగ్: బండి కొడుకు వ్యవహారం.. డీజీపీపై రేవంత్ సీరియస్..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో విచారణను తక్షణమే వేగవంతం చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ ను సీఎం ఆదేశించారు. సచివాలయంలో డీజీపీతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు..!

బాధితురాలు ఈ నెల 8వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని నిలదీశారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పోలీసులు తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ వివరణ ఇస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున, పోలీసు యంత్రాంగం మొత్తం.. గత కొన్ని రోజులుగా.. భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైందని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!

ఈ కారణం చేతనే కేసు విచారణలో స్వల్ప జాప్యం జరిగిందని ఆయన ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. ప్రస్తుతం భద్రతా విధులు ముగియడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. బండి భగీరథపై ఓ బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు, సీఎం జోక్యంతో ఇప్పుడు విచారణను వేగవంతం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా సంకేతాలు పంపింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్