అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిపాదించిన దిగుమతి సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా 1970ల నాటి వాణిజ్య చట్టాన్ని అడ్డం పెట్టుకుని విదేశీ వస్తువులపై 10% అదనపు సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం చెల్లదని కోర్టు తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ టారిఫ్లు 1970వ దశకంలోని వాణిజ్య చట్టం పరిధిలోకి రావని కోర్టు అభిప్రాయపడింది.
Also Read : బీజేపీలోకి కొడాలి నాని.. నిజమేనా..?
ఆ చట్టం ప్రకారం సుంకాలు విధించడానికి ఉండాల్సిన నిర్దిష్ట ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రస్తుతం లేవని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇది అధ్యక్షుడి అధికారాల అతిక్రమణేనని, కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చెల్లదని 2-1 మెజారిటీతో తీర్పునిచ్చారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 24 రాష్ట్రాలు.. ఎక్కువగా డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు ఏకమై కోర్టును ఆశ్రయించాయి. ఈ టారిఫ్ వల్ల అమెరికన్ వినియోగదారులపై పెను భారం పడుతుందని, వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వాదించారు.
Also Read : ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్.. మరణం ఖాయమా..?
ఫిబ్రవరిలో విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవు అని కోర్ట్ స్పష్టం చేసింది. ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను సంబంధిత వ్యాపార సంస్థలకు వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. దీనితో అధ్యక్షుడికి ఉన్న ట్రేడ్ పవర్స్ విషయంలో కోర్టు కొత్త గీతను గీసింది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు ట్రంప్ భవిష్యత్తు వాణిజ్య వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై ట్రంప్ బృందం అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

