Thursday, May 7, 2026 07:50 PM
Thursday, May 7, 2026 07:50 PM

మాజీ ఐఏఎస్‌లు ఏమనుకుంటున్నారంటే..?

చంద్రబాబు గురించి రిటైర్డు ఐఏఎస్ అధికారులు ఏమనుకుంటున్నారు..? అసలు చంద్రబాబు పేరు చెబితేనే ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు భయపడతారు..? మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి.. చేష్టలు చూస్తే మాత్రం గడప కూడా దాటటం లేదు.. అనేది పెద్దల మాట. ఇప్పుడు చంద్రబాబు గురించి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. నిజాయతీ, సమర్ధత పై చంద్రబాబు చెప్పే మాటలు, నీటి మూటలు అవుతున్నాయంటున్నారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. అని మాజీలంతా ముక్కకంఠంతో విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ప్రధాన కారణం అధికారుల బదిలీలు, పోస్టింగులే కారణం అని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : ఏపీకి మరో దిగ్గజ కంపెనీ.. లోకేష్ చేతుల మీదుగా భూమిపూజ

వైసీపీ ప్రభుత్వంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం చంద్రబాబుకు చేరువయ్యారనే మాట బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వారే ఇప్పుడు సన్నిహితంగా కూడా ఉన్నారంటున్నారు. దీని అర్ధం ఏమిటంటే.. చంద్రబాబు చుట్టూ ఎలాంటి వారున్నారో స్పష్టమవుతోంది. 2014-19 మధ్య కాలంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించి.. తన ప్రభుత్వంపై కుట్రలు చేసిన వారంతా.. ఆ తర్వాత వైసీపీ సర్కార్‌లో ఉన్న ఐదేళ్ల పాటు జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. వారంతా ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత చంద్రబాబు చుట్టూ చేరారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు వ్యవహరిస్తున్నారని.. కూటమి సర్కార్‌ నిర్ణయాలను సైలెంట్‌గా వైసీపీకి చేరవేస్తున్నారంటూ పది మంది ఐఏఎస్ అధికారులపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న పది మంది ఐఏఎస్ అధికారుల్లో కేవలం ఒక్కరిని మాత్రమే బదిలీ చేసి.. హమ్మయ్య అని చేతులు దులుపుకున్నారని మాజీ అధికారులు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి 2019-24 మధ్య కాలంలో ఏపీ సచివాలయంలో చంద్రబాబు పేరు ఎక్కడా, ఎప్పుడూ వినిపించలేదు. వైసీపీకి 151 సీట్లు గెలిచినట్లు ఫలితాలు వెలువడక ముందే.. కొందరు ఐఏఎస్ అధికారులు అయితే గవర్నర్ ఆదేశాలతో కూడా పని లేకుండానే ముందే సచివాలయంలోని అన్ని బ్లాక్‌లు, మంత్రుల ఛాంబర్‌లలో ఉన్న చంద్రబాబు ఫోటోలను తొలగించారు. “అప్పుడే ఏంటి సార్..” అని అడిగిన వారికి.. “ఓడిపోయారు కదా.. ఇంక ఎందుకు చెప్పండి..” అని తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

Also Read : గర్ల్ ఫ్రెండ్ కల్చర్‌కు బ్రేక్ పడుతుందా..?

వైసీపీ పాలనలో చంద్రబాబు పేరు ప్రస్తావించడానికి కూడా ఉద్యోగులు భయపడిపోయారు. ఇక మంత్రులు పేషీల్లో అయితే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా చంద్రబాబు అభిమానులు లేరు. అలా ఎవరైనా అభిమానం చూపిస్తే చాలు.. వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలుంటాయి. కానీ ప్రస్తుతం మంత్రుల పేషీల్లో కూడా చంద్రబాబు అభిమానులకంటే కూడా వైసీపీ సర్కార్‌లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అసలు చంద్రబాబుకు అభిమానులు అసలు లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కూడా. చివరకు సీఎం పేషీలో కూడా రాజమౌళి లాంటి ఒకరిద్దరు మినహా.. వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులతో పాటు ఉన్నత ఉద్యోగులకు కూడా చంద్రబాబు పై అభిమానం అంతంత మాత్రమే అని వాళ్లు చేస్తున్న పనులు చూస్తే తెలిసిపోతుంది.

అసలు విషయం ఏమిటంటే.. చంద్రబాబు మనస్తత్వంపై రిటైర్డ్ ఐఏఎస్‌లు కాస్త అసహనంతో ఉన్నారు. ఎవరినైనా ఒకసారి నమ్మితే.. వారి గురించి నిజాలు తెలిసినా కూడా పట్టించుకోరు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరిని ఎంత వరకు నమ్మాలో ఆయనకు బాగా తెలుసు. కానీ దానిని ఆచరణలో మాత్రం చూపించటం లేదు. వాస్తవానికి జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే ఏకైక లక్ష్యంతో కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ రేయింబవళ్లు పని చేస్తున్నారు. కానీ చంద్రబాబు కోసం మాత్రం టార్చ్ లైట్ వేసి వెతికినా సరే.. ఒక్కరు కూడా అలాంటి వారు కనిపించటం లేదంటున్నారు సీనియర్లు. ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ చేరిన ఐఏఎస్‌ అధికారుల్లో జగన్ మోహన్ రెడ్డి అభిమానులే ఎక్కువగా కనిపిస్తున్నారు.

Also Read : లోకేష్ సంచలన నిర్ణయం, ఫ్యాన్సీ విధానాలకు గుడ్ బై..!

ముఖ్యంగా సీఎంఓలో ఒక రాజమౌళి, ఆయన పేషీ అధికారులు మినహా మిగతా అధికారులు, వారి ఆంతరంగిక సిబ్బందిలో కనీసం ఒక్కరికి కూడా చంద్రబాబు పైన అభిమానం లేదు. వారిలో ఎక్కువ మంది జగన్ మోహన్ రెడ్డి అభిమానులే అని సచివాలయంలో కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. సీఎంఓలో ఉన్న రిటైర్డు ఐఏఎస్ అధికారి విజయనంద్‌తో పాటు, మరో సీఎంఓ అధికారి ప్రద్యుమ్న కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన వారే. ఈ విషయం చంద్రబాబు సహా టీడీపీ నేతలందరికీ తెలుసు కూడా. కానీ ప్రస్తుతం అవేవీ పట్టించుకోవటం లేదు. తాను చెప్పిన పనులు చెప్పినట్లుగా వెంటనే చేస్తే చాలు.. అంటున్నారంట.

నిజానికి ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కూడా వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు. ఇక జీఏడీ శాఖాధిపతి రావత్ అయితే.. వైసీపీ ప్రభుత్ లో ఆర్ధిక శాఖాధిపతిగా చక్రంం తిప్పారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు కూడా. హైదరాబాద్‌లో జరిగిన ఒక మహిళ హత్య కేసులో ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కున్న మరో ఐఏఎస్ అధికారి కూడా ప్రస్తుతం కీలక స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ కనిపిస్తున్న ఐఏఎస్ అధికారుల్లో కనీసం ఒక్కరైనా నిజాయితీ పరులు ఉన్నారా.. అని రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

లోకేష్ మరో రాయల్...

ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

బ్రేకింగ్: టీడీపీ సంచలన...

ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

బ్రేకింగ్: నేడే విజయ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది....

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

పోల్స్