Friday, May 1, 2026 03:57 PM
Friday, May 1, 2026 03:57 PM

సీఎం చంద్రబాబు.. పవన్ క్లారిటీ.. లోకేష్ మౌనం..!

15 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు ఉంటారని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని, చంద్రబాబు సీఎంగా ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం.. ఈ మాటను బలంగా చెప్పడంలో విఫలమవుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ కూడా ఈ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. నిజానికి సొంత పార్టీ సీనియర్ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషి ఆయనే..!

తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు నేత ఎవరు అంటే.. ఠక్కున చెబుతున్న పేరు నారా లోకేష్. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ.. 20114 తర్వాత నుంచే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా వ్యవహరించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వెనుకడుగు వేయలేదు. ఓడిన చోటే గెలిచి చూపిస్తా అంటూ శపధం చేశారు. నాటి అధికార పార్టీ నేతలు కూడా ఇదే విషయంపై లోకేష్‌ను పదే పదే టార్గెట్ చేశారు. ముందు గెలిచి చూపించు.. అంటూ గేలి చేశారు. ఐదేళ్ల పాటు అదే మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉన్న లోకేష్.. చివరికి ఎన్నికల్లో ఏకంగా 90 వేల ఓట్ల మెజారిటీతో భారీ విజయం అందుకుని తన ప్రత్యర్థుల నోరు మూయించారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్.. 2023లో యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తు నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే లోకేష్‌ను భవిష్యత్తు సీఎం అంటూ టీడీపీలో కొందరు నేతలు పదే పదే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని అటు అధినేత కానీ, ఇటు లోకేష్ కానీ ఎక్కడా కొట్టిపారేయటం లేదు. దీంతో సీఎం అవ్వాలనే కోరిక లోకేష్‌కు ఉందని.. అందుకే పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అనే మాట లోకేష్ చెప్పటం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. కానీ లోకేష్ మాత్రం మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎం అని ఎందుకు క్లారిటీగా చెప్పటం లేదని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సీఎం కుర్చీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండే కోరిక. దానికి ఒక అర్హత కావాల్సిందే. ఆ అర్హత తనకు ఉందనేది లోకేష్ అభిప్రాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే దానికి కొంత సమయం ఉందని ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో పల్లా చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : ఎల్పీజీ సిలెండర్లపై నేటి నుంచే కొత్త రూల్స్..!

చెప్పాలనుకున్న విషయాన్ని పల్లా చెప్పలేకపోయారనే మాట బాగా వినిపిస్తోంది. తన మనసులో మాటను బయటపెట్టేందుకు కూడా పల్లా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఎంతో అనుభవం ఉన్న నేత కూడా ఎందుకు తడబాటుకు గురయ్యారనేది అర్థం కావటం లేదు. అసలు విషయం ఏమిటంటే.. 2029లో కూడా టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని.. అప్పుడు కూడా టీడీపీ నేతే మళ్లీ సీఎం అవుతారన్నారు. అంతే కానీ.. చంద్రబాబు సీఎం అవుతారనే మాట నేరుగా చెప్పలేదు. అయితే పక్కనే ఉన్న మంత్రి లోకేష్ తెలివిగా సైగ చేయటంతో.. సర్దుకున్న పల్లా.. మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారన్నారు. ఈ మాటలో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో కొందరు లోకేష్ అభిమానుల ముసుగులో తెర వెనుక నుంచి పుకార్లు పుట్టిస్తున్నారనేది వాస్తవం. అయితే లోకేష్ సీఎం అవుతారని పదే పదే ప్రచారం చేస్తున్నా.. లోకేష్ వాటిని ఎందుకు ఖండించటం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎక్కడో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం.. మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారనే మాట.. పవన్ చెప్పినట్లుగా ఇప్పటి వరకు లోకేష్ బలంగా చెప్పలేదు. ఇదే టీడీపీ నేతల్లో కూడా అనుమానం కలిగిస్తోంది.

Also Read : అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

అసలు విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే పనులు మాత్రం లోకేష్ చెబితేనే జరుగుతున్నాయని.. పెత్తనం అంతా ఆయన కోటరీ సభ్యులే చేస్తున్నారనే విమర్శలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. అటు పార్టీలో కూడా నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల కేటాయింపు కూడా లోకేష్ డైరెక్షన్‌లోనే జరిగిందనే మాట పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక అధికారుల బదిలీల్లో కూడా లోకేష్ ప్రభావమూ ఎక్కువగా పని చేస్తుందంటున్నారు. నిజానికి ఆయనకు ప్రత్యేకంగా సీఎం పోస్టు అవసరమా అని సచివాలయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు నిజంగా లోకేష్ సీఎం పదవి ఆశిస్తున్నారా.. అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్...

భారతదేశ విద్యా చరిత్రలో ముందెన్నడూ లేని...

తిరుమల కల్తీ నెయ్యి...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

మాట తప్పిన కేంద్రం.....

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్...

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

పోల్స్