Friday, May 1, 2026 03:00 PM
Friday, May 1, 2026 03:00 PM

LPG సిలెండర్లపై నేటి నుంచే కొత్త రూల్స్..!

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎల్‌పీజీ.. వినియోగదారుల కోసం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి అంటే మే 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల సిలిండర్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్నీ మారిపోనున్నాయి. ప్రధానంగా గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నో డ్యూయల్ గ్యాస్ విధానం కఠినంగా అమలు కానుంది.

Also Read : ఏపీ బ్రాండ్‌కి సచిన్‌ ప్రమోషన్‌.. లోకేష్ మాస్టర్ ప్లాన్‌ అదుర్స్

అంటే ఒకే చిరునామాపై ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండటం నిషిద్ధం. ఒకవేళ ఒక ఇంట్లో వేర్వేరు కంపెనీల కనెక్షన్లు ఉంటే, వాటిని వెంటనే నిలిపివేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ కనెక్షన్ల ద్వారా సబ్సిడీని పొందుతున్న వారిని గుర్తించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సిలిండర్ డెలివరీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఓటీపీ డెలివరీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ కు ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది.

Also Read : మాట తప్పిన కేంద్రం.. బాదుడే బాదుడు..!

ఆ ఓటీపీని డెలివరీ ప్రతినిధికి చెబితేనే మీ సిలిండర్ మీకు అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని, గ్యాస్ సిలిండర్లు దారి మళ్లకుండా నేరుగా వినియోగదారుడికే అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ వివరాలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో సిలిండర్ బుకింగ్ నిలిచిపోవడమే కాకుండా, సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉండదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్...

భారతదేశ విద్యా చరిత్రలో ముందెన్నడూ లేని...

సీఎం చంద్రబాబు.. పవన్...

15 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు...

తిరుమల కల్తీ నెయ్యి...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

మాట తప్పిన కేంద్రం.....

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్...

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

పోల్స్